జనసేన పార్టీ మాజీ సభ్యుడు మరియు మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అన్నీ అవినీతి కేసులను దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన చాలా గొప్ప పేరు సంపాదించాడు. ఒక రకంగా జగన్ జైలు పాలు కావడానికి పరోక్షంగా లక్ష్మీనారాయణే కారణమని అంతా అంటుంటారు. అయితే తర్వాత అనూహ్యంగా మహారాష్ట్రకు బదిలీ అయిన జెడి లక్ష్మీనారాయణ తర్వాత తన పోస్టుకు రాజీనామా చేసి వచ్చేశారు.

 

తర్వాత రాజకీయాల పైన దృష్టి సారించిన ఆయన గురించి కొద్దిరోజులు బిజెపిలోకి వెళ్తారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయినా చంద్రబాబు నుండి ఆయనకు పిలుపు వచ్చింది అని చెప్పినా…. ఎవరూ ఊహించని రీతిలో అతను జనసేన పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్ళిన తీరు కారణంగా చూపుతూ తాను జనసేనలో పరిస్థితి ఇలా ఉంటే కొనసాగలేనని చెప్పి రాజీనామా చేయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

 

చాలా రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న జెడి ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో జగన్ పరిస్థితి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కరోనా జ్వరం లాంటిదని.. దానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చేసిన కామెంట్స్ పై జె.డి స్పందించారు.  విషయంపై ప్రతిపక్షాలు మరికొన్ని పార్టీల నాయకులు జగన్ పై విమర్శలు చేయగా...జేడీ లక్ష్మీనారాయణ మాత్రం జగన్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.

 

ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగా ప్రజలను భయాందోళనలకు గురి చెయ్యకుండా మాట్లాడడం మంచిదే అని అన్నారుఅయితే అలా అనడం మూలాన దానిని తక్కువ కేర్ చేసి ర్యాలీలు జనాన్ని పోగేసి మీటింగులు కూడా పెట్టకూడదని చిన్న సంశయంలోకి నెట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చారని జేడీ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: