ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వార్తలే. కరోనా కేసులు ఎక్కువ వస్తే వార్త.. కరోనా కేసులు తగ్గిపోతే వార్త. ఓ సెలబ్రెటీకి కరోనా వస్తే వార్త. ఓ ప్రముఖ కంపెనీలో కోరనా వస్తే అదో వార్త. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడికి చెందిన ఓ కంపెనీలో కొందరికి కరోనా వస్తే ఇది ఇంకా పెద్ద వార్త కదా. మరి అలాంటి కీలక వార్తను మాత్రం కొన్ని మీడియా సంస్థలు మిస్ అయ్యాయి. తమ మీడియా సంస్థల్లో ప్రచురించలేదు. ప్రసారం చేయలేదు.

 

 

ఆ నాయకుడెవరు.. ఆ కంపెనీ ఏంటి అంటారా.. అదే చంద్రబాబునాయుడుకి చెందిన హెరిటేజ్ కంపెనీ. హైదరాబాద్ ఉప్ప హెరిటేజ్ పాల ఫ్యాక్టరీకి చెందిన కొందరికి కరోనా వచ్చింది. దీంతో 33 మందిని హెరిటేజ్ ఉద్యోగులను క్వారంటైన్ కు పంపారు. ఈ విషయం కొన్ని మీడియా సంస్థల్లోనే వచ్చింది. ఇప్పుడు వైసీపీ నాయకులు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో కరోనా వస్తే ఆయన అనుకూల మీడియా ఎందుకు తొక్కి పెట్టిందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

 

గవర్నర్ బంగ్లాలో నలుగురికి కరోనా వస్తే పెద్ద పెద్ద బ్రేకింగ్ వేసిన మీడియా సంస్థలు హెరిటేజ్ లో కరోనా పాజిటివ్‌ కేసులు వస్తే ఎందుకు దాస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు చంద్రబాబును కూడా ప్రశ్నిస్తున్నారు. హెరిటేజ్ లో కరోనా కేసులు వస్తే కంట్రోల్ చేయలేని వారు ఆంధ్రప్రదేశ్ లో కేసులు కంట్రోల్ చేస్తారా..అంటూ నిలదీస్తున్నారు.

 

 

ఇటీవల చంద్రబాబు తరచూ ఏపీ సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. ఫలానా జాగ్రత్తలు తీసుకోండి.. ఫలానా పనులు చేయండి అని సూచిస్తున్నారు. దీనిపైనా వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. కరోనా కేసులు దేశంలో లేవా..? తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో మనకంటే ఎక్కువ లేవా.. ఏపీలోనే కరోనా కేసులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పిచ్చి లేఖలు వలన ఎలాంటి ప్రయోజనం లేదని అంబటి రాంబాబు అన్నారు. ప్రజలకు మంచి చేయడమే జగన్ లక్ష్యమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: