కరోనా... కరోనా.. కరోనా.. కరోనా కారణంగా ఇల్లు కదిలే అవకాశం లేదు. ఉద్యోగం లేదు.. 24 గంటలూ ఖాళీ.. మరి ఎంత సేపు టీవీ, ఫోన్, కంప్యూటర్.. అందుకే ఇప్పుడు ప్రపంచంలో వయస్సులో ఉన్న మొగుడూ పెళ్లాలు తెగ రెచ్చిపోతున్నారట. వీలు దొరికినప్పుడల్లా సరససల్లాపాల్లో మునిగిపోతున్నారట. ఈ విషయాలను ఇప్పుడు అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల డంజో యాప్ సమాచారం ఆధారంగా ఇళ్ల నుంచి ఏమేం ఆర్డర్ చేస్తున్నారు అన్న సమాచారం ఆధారంగా ఈ సర్వేలు నిర్వహించారట.

 

 

ఈ సర్వేలో తేలిందేమిటంటే.. బెంగుళూరు, పూణెల్లో ఎక్కువగా గర్భధారణ పరీక్షలకు వాడే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లను ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారు. ముంబైలో కండోమ్స్, హైదరాబాదులో గర్భధారణను అడ్డుకునే ఐపిల్స్ ఎక్కువగా ఆర్డర్ చేశారు. మరీ విచిత్రం ఏంటంటే.. గతంలో ఒక ఏడాదంతా ఎన్ని ఇంట్రాసెప్టివ్ పిల్స్ కోసం ఆర్డర్లు వచ్చాయో... ఇప్పుడు కేవలం 20 రోజుల్లో అన్ని ఆర్డర్లు వచ్చాయట.

 

 

కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచమంతా అదే తరహాలో ఉందట. లాక్ డౌన్ కారణంగా జనం సెక్స్ కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారట. అందువల్ల రాబోయే నెలల్లో కనీసం 70 లక్షల అవాంఛిత గర్భాలు తప్పకపోవచ్చునని యూఎన్ పాపులేషన్ ఫండ్ ఓ అంచనాను ప్రకటించింది. ఈ లాక్ డౌన్లు ఇలాగే కొనసాగితే ఏకంగా 5 కోట్ల మంది మహిళలకు గర్భనిరోధక మందులు దొరకవట.

 

 

నిజమే.. ఇన్నాళ్లూ ఆఫీసులు, ఉద్యోగాలు, టార్గెట్లు అంటూ నిరంతరం పనిలో మునిగిపోయిన ఉద్యోగజీవులు ఇప్పుడు అవన్నీ లేకపోవడంతో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అంటే కరోనా కూడా ఒక రకంగా ఇలా యువ దంపతులకు మేలు చేసిందన్నమాట. ఇంట్లో కూర్చుని ఏమీ తోచక సెక్స్ పై దృష్టి సారిస్తున్నారన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: