కరోనా వైరస్‌తో పాటుగా మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది.. ఇప్పటికే కరోనా వల్ల బయటకు వెళ్లలేకపోతున్న ప్రేమికుల బాధలు అన్ని ఇన్ని కావు.. ఇదే కాకుండా ఈ లాక్‌డౌన్ కాలంలో అక్రమ సంబంధాలు నెరిపేవారు బోనులో పడ్డ ఎలుకలా తయారు ఆయ్యారు.. ఇదంతా పక్కన పెడితే ఈ కరోనా కొంత మంది తమ పార్ట్‌నర్‌తో కాకుండా బయటి వ్యక్తులతో ఉన్న సంబంధాలను కూడా బట్టబయలు చేసింది.. మరికొందరి కాపురాల్లో చిచ్చులు కూడా పెడుతుంది.. కాగా ఈ లాక్‌డౌన్ మరో జంట బండారం బయటపెట్టింది..

 

 

అదెలా అంటే ఈ సమయంలో అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఉద్యోగులను ఆదేశించాయి. ఈ నేపధ్యంలో చాలా మంది ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు.. ఇకపోతే ఈ వర్క ఫ్రమ్ హోమ్ వల్ల ఇటీవల స్పెయిన్‌కు చెందిన ఆల్ఫాన్సో మెర్లోస్(41) అనే యాంకర్ కొంపమునిగింది. ఈ యాంకర్ తన ఇంట్లో నుంచి లైవ్ ఇస్తుండగా అతని వెనుక నుంచి సగం దుస్తులతో ఉన్న ఓ మహిళ వెళ్లింది. వెంటనే ఈ మహిళను చూసిన వీక్షకులు.. ఆమె ఆల్ఫాన్సో భార్య మార్తా లోపెజ్ కాదని, ఆమె జర్నలిస్ట్ అలెక్సియా రివాస్, ఆ యాంకర్ గర్ల్‌ఫ్రెండ్ అని కనిపెట్టేశారు..

 

 

ఇక ఈ విషయం బయటకు పొక్కిన చాలా రోజుల నిశ్శబ్దం తరువాత ఆల్ఫాన్సో  స్పందింస్తూ, తన భార్యకు క్షమాపణలు చెప్పే క్రమంలో... లైవ్ షోకు ముందే తాను అలెక్సియాతో విడిపోయినట్టు చెప్పడానికి ప్రయత్నించాడు.కానీ వీరిద్దరి మధ్య ఆ సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆరోపించడమే కాకుండా.. లైవ్ షో ఘటన అసహ్యంగా, సిగ్గుచేటుగా ఉందంటూ మార్తా లోపెజ్ మండిపడింది.. ఏది ఏమైనా బాసు ఈ కరోనా కాలంలో బయటి పులుసులు మరిగిన వారికి ఇంట్లో రుచులు రుచించక పంజరంలోని చిలుకలా గింజుకుంటున్నారు.. ఏం చేద్దాం కలికాలం..   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: