ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాల్లో  తీరని శోకాన్ని నింపుతున్నాయి. అంతేకాకుండా ఎంతోమందిని జీవచ్ఛవంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అతి వేగం కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం తెలంగాణ వాసుల కుటుంబాల్లో విషాదం నింపింది. 

 

 

 అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడానికి కారణం అతి వేగమె  అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే... కర్ణాటక లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గద్వాల జిల్లా కేటి దొడ్డి కి చెందిన గోపాల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇక లాక్ డౌన్  నేపథ్యంలో ఇన్ని రోజుల వరకు బెంగళూరులోనే ఉండిపోయినా గోపాల్ తాజాగా... స్వగ్రామానికి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ఉదయం కారులో బెంగళూరు నుంచి స్వగ్రామానికి బయలు దేరాడు. 

 

 

 ఈ క్రమంలో గోపాల్ ప్రయాణిస్తున్న కారు రాయచూరు జిల్లా మాన్వి  వద్ద అతి వేగం కారణంగా అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ తో పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగుళూరు లో పనిచేస్తున్న గోపాల్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కారులో మరో ముగ్గురు మహిళలు ఉండగా వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచూరు ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: