కామం కళ్లకు ఎక్కితే మంచి చెడులు మరచి ప్రవర్తిస్తుందంటారు.. నేటి సమాజంలో జరుగుతున్నది ఇదే.. లోకంలో మంచిగా బ్రతికే వారు దాదాపుగా తగ్గిపోయారు.. తగ్గి పోతున్నారు.. ఒళ్లు దగ్గరపెట్టుకుని బ్రతడం మరచిపోతున్న మనుషుల్లో మానవత్వం కూడా ఉండటానికి ఇష్టపడటం లేదు.. సహయం చేసిన వారి చేతులనే నరికేసే ఆలోచనలతో జీవిస్తున్న సమాజం నుండి మంచిని కోరుకోవడం కూడా తప్పే.. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అన్నారు.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం, మారదు కాలం అనీ.. ఇది అక్షర సత్యం అనిపిస్తుంది.. నేడు సమాజంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే..

 

 

ఒకవైపు కరోనా వైరస్‌తో జీవితాలు అస్తవ్యస్తంగా మారుతుంటే.. మరో వైపు కామాంధులు రెచ్చిపోతున్నారు.. మరి కొందరు బ్రతుకుతెరువు కోసం వచ్చి బుద్ధిగా పనులు చేసుకుని ఉన్నదాంట్లో తిని చావక సమాజానికి చీడపురుగుల్లా మారారు.. మనది కాని ఊరికి వెళ్లినప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని బ్రతకడం నేర్చుకోవాలి.. అంతే కానీ మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు కొందరు వలస వచ్చిన కార్మికులు.. ముఖ్యంగా యూపీ, ఎంపీ మొదలగు అటువైపు నుండి వచ్చిన వారి నుండే నగరంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు.. ఇకపోతే వలస వచ్చిన ఒక యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల్లోకి వెళ్ళాడు.. ఎల్బీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం..

 

 

బండ్లగూడలోని ఆనంద్‌నగర్‌లో నివసించే ఓ కుటుంబం కూరగాయలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్నారు.. అయితే ఆ తల్లిదండ్రులు ఇంటి పనుల్లో ఉండగా వారి కుమార్తె(10) నిన్న అంటే గురువారం.. దుకాణంలో ఒంటరిగా ఉంది.  ఆ సమయంలో అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు రామ్ కుమార్ (25) బాలిక దగ్గరికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది..

 

 

వారు బయటకు వచ్చేలోపే, ఆ నిందితుడు పారిపోతున్నాడు.. ఆ బాలిక తండ్రి వాన్ని వదిలిపెట్టకుండా వెంటపడి పట్టుకోగా, అప్పటికే అక్కడ స్దానికులు గుమ్మి కూడారు.. కోపంతో ఉన్న ఆ బాలిక తండ్రి స్థానికులతో కలిసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, వారు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: