ప్రస్తుతం దేశాన్ని మొత్తం కరోనా  వైరస్ కబళిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా  మాత్రం విలయతాండవం చేస్తోంది. కొంత మంది నిర్లక్ష్యం ఎంతోమందికి శాపంగా మారుతోంది. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసి దేశ ప్రజలందరి ఇంటికే పరిమితం అయ్యేలా చేసింది  కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  అమలు చేసి ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేసిన  నేపథ్యంలో సైనికుల్లా పని చేస్తున్నారు డాక్టర్లు హెల్త్ వర్కర్లు  పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు. ఏ చిన్న పొరపాటు జరిగినా తన ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి సేవ చేయడానికి ముందుకు సాగుతున్నారు. 

 

 

 ముఖ్యంగా కరోనా  పోరాటంలో డాక్టర్లు హెల్త్ వర్కర్ల పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సైనికుల్లా పని చేస్తూ దేశానికి సేవ చేస్తున్న వారు మన కుటుంబంలో ఉంటే ఎంతో గౌరవంగా ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఉద్యోగం మానేయాలి అంటూ భార్య కు వేధింపులు మొదలుపెట్టాడు. అన్ని విధాలుగా చిత్రహింసలు చేశాడు. వెంటనే ఉద్యోగం మానేసి సొంతూరుకు వెళ్ళిపోయి అక్కడ కాపురం చేద్దామంటూ భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. భార్య ఎంతకు ఉద్యోగం మానేయడానికి ఒప్పుకోకపోవడంతో... ఉన్మాదిలా మారిపోయాడు సదరు భర్త. ఇక ఏకంగా భార్య కాళ్ళు చేతులు విరగ్గొట్టేసాడు. 

 

 

 ఈ దారుణ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. తిరుపతిలో ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా కొనసాగుతుంది మహిళ. అయితే భార్యను జాబ్ మానేయాలని ఎన్నో  రోజులనుండి భర్త వేధింపులు మొదలుపెట్టాడు. ఎంతకీ భార్య జాబ్ మానకపోవడం తో... తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని స్వగ్రామానికి వెళ్లి పోయాడు భర్త. ఇక భర్త వెళ్లి పది రోజులు కావడంతో పిల్లలపై బెంగతో తల్లి కూడా స్వగ్రామానికి వెళ్ళింది. ఇక ఇదే అదునుగా భావించిన భర్త ఇనుప రాడ్ తో  భార్య పై  విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లు చేతులు విరగ్గొట్టాడు. ప్రస్తుతం సదరు మహిళ రియా  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: