ఒకప్పుడు మానవ సంబంధాలు ఎంతో పవిత్రంగా గౌరవంగా ఉండేవి. ఉమ్మడి కుటుంబం.. తల్లీదండ్రుల అంటే ఎంతో గౌరవం.. కుటుంబ విలువలు ఉండేవి.  కానీ ఇప్పుడు అంతా ఫాస్ట్ కల్చర్.. ఉరకులు పరుగుల జీవితం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం.. దాంతో అత్తమామలు, తల్లిదండ్రులను వీడి ఒంటరి జీవితం గడపడం.. తాము తమ కుటుంబం మాత్రమే అన్నట్టుగా యాంత్రిక జీవన విధానానికి అలవాటయ్యారు.  వృద్ద్యాప్యం వస్తే తల్లిదండ్రుల భారం అనకుంటున్న సమాజంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని నిరూపించాడు ఓ కొడుకు.  నవమాసాలు తనను కడుపున మోసి జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకున్నాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది.  

 


అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చికిత్స చేయించేందుకు ఈ విధంగా వెళ్లాల్సి వచ్చింది.  ప్రస్తుతం కరోనాతో దేశం అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే.  కరోనా అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు.. దాంతో ఎవరూ బయటకు రాకుండా ఇంటిపట్టున ఉంటున్న విషయం తెలిసిందే. అధికారుల కఠినత్వంతో ఆ వ్యక్తి పడిన బాధ చూసిన వారందరిని కలిచివేసింది.  దురదకుంటకి చెందిన రామక్క అనే మహిళ కు 3 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమెకు వైద్యం చేయించేందుకు కొడుకు రవి ఆటోలో కల్యాణదుర్గానికి బయలుదేరాడు. 

 

 


అయితే అక్కడ లాక్ డౌన్ కారణంగా  వాహనాన్ని పోలీసులు లోపలికి అంగీకరించలేదు. ఇక చేసేది ఏమీ లేక తన తల్లిని  వీపుపై వేసుకొని నడుచుకుంటూ ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగినా వైద్యం చేయడానికి నిరాకరించారు. ఇక చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు.. చికిత్స చేయించాడు.  ఇలా తన తల్లిని రెండు మూడు గంటల పాటు తన వీపుపైనే మోస్తూ నవడం పలువురిని కలచివేసింది.  తాజాగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: