దేశంలో కరోనా వ్యాప్తి ఎప్పుడైతే మొదలు పెట్టిందో అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలోనే గత నెల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కన్నా ముందే కరోనా భయంతో షాపింగ్ మాల్స్, మద్యంషాపులు, బార్లు, క్లబ్బులు, థియేటర్లు ఇతర జనసందోహంగా ఉండే అన్ని ప్రదేశాలు మూసివేశారు. లాక్ డౌన్ తర్వాత రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా స్తంభించిపోయింది. అప్పటి నుంచి మందుబాబుల పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్థమైంది.  ఒకటీ రెండు రోజులు మద్యం షాపులు మానేస్తేనే అల్లాడిపోతుంటారు.. అలాంటిది నెల రోజులకు పైగా మద్యం దుఖానాలు బంద్ చేయడంతో చాలా మంది మానసికంగా కృంగిపోతున్నారు.

 

కొంత మంది డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు.. మరికొంత మంది పిచ్చిపట్టిన వాళ్లలా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. దాంతో మద్యం కోసం రక రకాల మార్గాలు వెతుకుతున్నారు.. ఎక్కువ డబ్బులు పెట్టి మద్యం కొనలేక.. మద్యం తాగకుండా ఉండలేక నానా అవస్థతలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో మద్యం షాపులను వెంటనే తెరిపించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా  రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్ కపూర్, మద్యం షాపులను తక్షణం తెరిపించాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఓ లేఖను రాశారు. ఈ లేఖలో తన విజ్ఞప్తిలో అసలు మద్యం షాపులు ఎందుకు తెరవాలో ఓ లాజిక్ కూడా జోడించారు.

 

ఆల్కహాల్ తో చేతులను శుభ్రం చేసుకుంటే, చేతిపై ఉన్న కరోనా క్రిములు చనిపోతాయని గుర్తు చేసిన ఆయన, గొంతులో తిష్టవేసి ఉండే కరోనా క్రిములను హతమార్చేందుకు మద్యాన్ని వాడొచ్చు కదా? అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉందని.. మార్కెట్లో మద్యానికి డిమాండ్ అధికంగా ఉందని, షాపులను తెరిపిస్తే, లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన ప్రభుత్వ ఆదాయాన్ని భర్తీ చేసుకోవొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: