క‌రోనా వైర‌స్.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. క‌రోనా నుంచి ఎలా త‌ప్పించుకోవాలా..? అని ప్ర‌జ‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద‌న్న‌గా చెప్పుకున్న అగ్రరాజ్యం అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 33 ల‌క్ష‌లు దాట‌గా.. క‌రోనా కాటుకు బ‌లైన వారి సంఖ్య 2.30 ల‌క్ష‌లు దాటింది. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ కొంద‌రు కామాంధులు దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారు. అమ్మ క‌డుపులో దాచాలంటే ఆడ‌పిల్ల‌కు క‌ష్టంగా మారింది.

 

ఇక పుట్టాక అడుగు వేస్తే ఆప‌ద‌.. గ‌డియ‌గ‌డియ‌కో గండం.. నిమిషానికోసారి త‌న‌ని తాను చూసుకొని బ‌తికున్నాని నిర్ధారించుకునే ప‌రిస్థితుల్లో.. ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా నింధితుల‌కు చుట్టాలుగా మారుతున్నాయి. ఇక ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన అధికారుల‌కే ర‌క్ష‌ణ లేదంటే.. స‌మాజం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా లాక్‌డౌన్ వేళ ఓ మహిళా హోంగార్డుపై ఎస్సై కీచకపర్వం ప్ర‌ద‌ర్శించారు. ఎస్సై లైంగిక వేధింపులను త‌ట్టుకోలేక స‌ద‌రు మహిళా హోంగార్డు పై అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యూపీలోని అలీగఢ్‌ జిల్లా ఇగ్లాస్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న లేడీ హోంగార్డు తనను ఎస్సై వేధిస్తున్నాడని ఎస్‌ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 

 

ఈ నెల 24న బ్యాంకు వద్ద విధులు నిర్వర్తిస్తుండగా ఎస్సై అక్కడకు వచ్చి.. త‌న‌తో హ‌ద్దులు మీరి ప్రవర్తించారని తెలిపింది. అనంతరం తనతో రమ్మని దారుణంగా మాట్లాడార‌ని.. తాను నిరాకరించడంతో చేయిపట్టుకుని లాక్కెళ్లేందుకు యత్నించాడని పేర్కొంటి. అయితే తాను కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని.. స‌ద‌రు ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీంతో అధికారులు దర్యాప్తు చేసి నివేదిక పంపాల్సిందిగా ఇగ్లాస్ పోలీస్ స్టేషన్ సీఐని ఆదేశాలు జారీ చేశారు. అయితే హోంగార్డు నిరాధార ఆరోపణలు చేస్తోందని.. డ్యూటీకి వెళ్లడం ఇష్టం లేకనే ఇలాంటి ఆరోపణలు చేసిందని సీఐ పరశురాం సింగ్ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: