వైఎస్సార్ నయం అని ఇప్పటికే వారికి అర్ధమవుతోంది. జగన్ తండ్రి కంటే దూకుడుగా ఉంటారు. నాలుగు అడుగులు ముందుకే వెళ్తారు. అది మంచికైనా, పంతానికైనా జగన్ రూటే సెపరేట్. జగన్ తో ఎదురు పడితే ఇక అంతే సంగతులు. దగ్గర దారి ఉండదు, ఎందుకంటే ఆయన పక్క చూపులు చూడరు కాబట్టి.

 

ఇపుడు తెలుగుదేశంలో అదే చర్చగా ఉంది. వైఎస్సార్ పాలనలో సైతం టీడీపీ ఇంతటి ఇబ్బందులు పడలేదు. వైఎస్సార్ సైతం టీడీపీ టార్గెట్ గా పాలిటిక్స్ చేసినా మరీ జగన్ లా అగ్రెసివ్ గా దూసుకురాలేదు. కానీ ఇపుడు జగన్ మాత్రం నా రూట్ సెపరేట్ అంటున్నారు. టీడీపీ అంతం నా పంతం అంటున్నారు. దాంతో చంద్రబాబుతో సహా తమ్ముళ్ళు డీలా పడుతున్నారు.

 

గత ఏడాది జరిగిన ఎన్నికలల్లో కేవలం 23 సీట్లు మాత్రమే సంపాదించిన తెలుగుదేశానికి రేపో మాపో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా కాస్తయినా ఆశలు లేవు. ఎందుకంటే జగన్ పూర్తిగా సర్దేస్తున్నారు. ఎక్కడా చిన్నమెత్తు చోటు కూడా టీడీపీకి ఇవ్వకూడదని పట్టుదలగా జగన్ పనిచేస్తున్నారు. కరోనా వైరస్ ఓ వైపు ఉన్నా చేతికి ఎముక లేనట్లుగా జగన్ సంక్షేమ  కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

 

ఇక రేషన్ ఇప్పటికి మూడు విడతలుగా ఇచ్చారు. పేదలకు వేయి రూపాయలు అందించారు. మళ్ళీ ఈ నెల కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పించను ప్రతీ పేద ఇంటికి వెళ్ళి ఫస్ట్ తారీకునే పంపిణీ చేయిస్తున్నారు. మరో వైపు ద్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. ఇంకో వైపు పూర్తి స్థాయిలో ఫీజ్ రీఇంబర్స్మెంట్ అమలుచేస్తున్నారు. రైతులకు కూడా ఆదుకుంటున్నారు. రైతు భరోసా పధకం ఇదే నెలలో అమలవుతోంది.

 

మొత్తం మీద చూసుకుంటే ఏపీ పొలిటికల్ మైదానంలో టీడీపీకి స్పేస్ లేకుండా చేస్తున్న జగన్ స్థానిక ఎన్నికలకు సర్వం సిధ్ధం చేసుకున్నారు. ఇలా కరోనా కేసులు తగ్గుముఖం పడితే అలా ఎన్నికలు పెట్టేస్తారు. ఇప్పటికే ఫీల్డ్ లో లేని టీడీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని బెంబేలెత్తుతోంది. ఇక లోకల్ బాడీ ఎన్నికల తరువాత పచ్చ పార్టీ మీద సర్పయాగం క్లైమాక్స్ కి చేరుకుంటుంది అంటున్నారు. మొత్తానికి 2020లో టీడీపీతో చెడుగుడు ఆడేస్తున్న జగన్ 2021 నాటికి నామమాత్రం చేయాలని డిసైడ్ అయిపొయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: