ఏపీలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని అంచనా వేసేందుకు, పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర బృందాలను పంపుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. 
 
తాజాగా కేంద్రం ఏపీకి కేంద్ర బృందంను పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలో కేంద్ర బృందం కేసులు ఎక్కువగా నమోదైన కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో పర్యటించనుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో కేసులు పెరగడానికి గల కారణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుని కొత్త కేసులు నమోదు కాకుండా సూచనలు చేయనుంది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు తెలుసుకోనుంది. 
 
అనంతరం ఆ నివేదికను కేంద్రానికి అందించనుంది. కేంద్రం కరోనా విజృంభిస్తున్న రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర బృందాలను పంపిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్ర బృందం రావాలని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తాజాగా కుట్రకు తెరలేపుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రాన్ని కేంద్ర బృందం సందర్శించే సమయంలో ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. 
 
జగన్ సర్కార్ పై ఫిర్యాదు చేయడం ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బృందాలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించినా అధికారంలో ఉన్న పార్టీలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయలేదు. ఏపీలో మాత్రం టీడీపీ కేంద్ర బృందాల పర్యటనను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. రాజకీయవర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. చంద్రబాబు ఏపీ పరువును కేంద్రం దగ్గర తీయడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: