అమెరికాలో డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎగరనున్నాయి. కరోనా కేసులు తగ్గే దిశలో కనిపించకపోయినా, ఆంక్షలు మాత్రం సడలించేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు పర్యటనలు కూడా మొదలు పెడుతున్నారు ట్రంప్. మరోపక్క వేలల్లో కేసులు మరణాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. 

 

అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అంత తేలిగ్గా తగ్గేలా కనిపించటం లేదు. కోవిడ్ మహమ్మారి దానంతట అదే పోతుందని, వ్యాక్సిన్ పై  ఆధారపడట్లేదంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నామంటున్నారు. వ్యాక్సిన్ ఉన్నా లేకున్నా ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే వైరస్ పోయేంత వరకు అందరూ ఓపికపట్టాలన్నారు.

 

ఈ క్రమంలో ట్రంప్ ఆంక్షల సడలింపు కూడా మొదలు పెట్టారు. దేశీయ ప్రయాణాలకు పచ్చజెండా ఊపారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే లాక్డౌన్తో అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. దీంతో, ఆంక్షల సడలింపే మార్గంగా భావిస్తోంది. 

 

వైరస్ దానంతట అదే పోతుందని, లాక్డౌన్తో నష్టపోయిన ఆర్థిక రంగం త్వరలోనే గాడినపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత  24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 2,502గా నమోదైంది. అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే బుధవారం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య 61,669కి పెరిగింది.

 

దేశీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాదు... వచ్చేవారం ఆర్థిక కలాపాలను మెరుగుపరచటం భాగంగా అరిజోనా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ట్రంప్. కరోనా వైరస్ విజృంభించాక ట్రంప్ వాషింగ్టన్ వదిలి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతేకాదు..  త్వరలో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టనున్నార. ఎన్నికల్లో కీలకమైన ఒహాయో రాష్ట్రంలో పర్యటించనున్నారు. తర్వలోనే భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కూడా రెడీ అవుతున్నారు.  సుమారు 25వేల మందితో సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఓ పక్క కేసులు పెరుగుతూ, మరణాలు భీకరంగా నమోదవుతున్న తరుణంలో ట్రంప్ నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: