ప్రపంచమంతటా కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు అనేక దేశాలు లాక్ డౌన్ ని అమలు చేయడం ప్రారంభించాయి. దాంతో కోట్ల మంది ఉద్యోగస్తులు ఇంటి నుండే తమ ఆఫీసు పనులను చేస్తున్నారు. విద్యార్థులకు కూడా ఇంటి నుండే పాఠాలను వింటున్నారు. అయితే అలాంటి వారి కోసం జూమ్ అనే యాప్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఉద్యోగస్తులు, వారి పై అధికారులు అందరూ కలిసి మీటింగులు నిర్వహించుకోవచ్చు. విద్యార్థులంతా కలిసి టీచర్స్ చెబుతున్న పాఠాలు వినొచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ వీడియో మీటింగ్ యాప్ సంస్థ... తమ యాప్ ని ప్రతిరోజూ 30 కోట్ల మంది వినియోగదారులు వాడుతున్నారని చెప్పుకొచ్చింది.


ఐతే తాజాగా ఆ సంస్థ ఇంతకుముందు చేసిన ప్రకటనను సరిదిద్దుతూ... 22వ తేదీన మేము చెప్పిన " జూమ్ యాప్ లో ప్రతిరోజు 30 కోట్ల మంది యాక్టీవ్ యూజర్స్ ఉంటారన్నది" తప్పు... వాస్తవమేమిటంటే చాలా మంది వినియోగదారులు మూడు నాలుగు కంటే ఎక్కువ సార్లు జూమ్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. పొరపాటున వారి ని కూడా మేము యూజర్స్ గా లెక్కించాము. ఈ తప్పు ని 23వ తేదీన గమనించాము. 30 కోట్ల మంది పార్టిసిపెంట్లు జూమ్ యాప్ లో పాల్గొంటున్నారు' అని గురువారం రోజు వెల్లడించింది.


గతంలో కూడా జూమ్ యాప్ యాజమాన్యం తమ యాప్ యొక్క ప్రైవసీ సామర్థ్యం గురించి లేనిపోని గొప్పలు చెప్పుకుని అభాసుపాలైంది. తమ అప్లికేషన్ యూస్ చేసే వినియోగదారులకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అనే సమర్థవంతమైన భద్రతను, ప్రైవసీని కల్పిస్తున్నామని అబద్ధాలు చెప్పి దొరికిపోయింది. నిజానికి జూమ్ యాప్ లో లోయర్ ఎన్క్రిప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే జూమ్ యాప్ కు పోటీగా గూగుల్, ఫేసుబుక్( వాట్సాప్) సంస్థలు కూడా ఉచితంగా తమ అప్లికేషన్ల ద్వారా వీడియో కాల్ లో మీటింగ్ లో చేసుకునేందుకు సదుపాయాలు కల్పించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: