కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడం కోసం పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో కొందరు పోలీసులపై అధికారజులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కార్పొరేటర్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
కానిస్టేబుళ్లపై మతం రంగు పులుముతూ కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాల దగ్గర విధులు నిర్వహించాలంటూ వ్యాఖ్యలు చేశారు. కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. కానిస్టేబుళ్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కార్పొరేటర్ పై, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. అయితే కార్పొరేటర్ మాత్రం మసీదుకు తాళం వేయమన్నందుకే తాము గొడవపడ్డామని చెబుతున్నాడు. 
 
మసీదుకు వేళం వేయాలని ఇచ్చిన పర్మిషన్ లెటర్ చూపించాలని తాము కోరామని వారు చూపించకపోవడంతో వివాదం మొదలైందని చెబుతున్నాడు. పర్మిషన్ లెటర్ చూపించకపోవడం వల్లే పోలీసులపై సీరియస్ ఆయ్యానని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ డీజీపీ ఈ కేసులో చర్యలు తీసుకుంటారని ఆశించవచ్చా అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. పోలీస్ శాఖ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు కార్పొరేటర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కరోనా కట్టడి విషయంలో సక్సెస్ అవుతూ ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి సమయంలో కొందరు పోలీసులను దుర్భాషలాడుతూ అధికార గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: