దేశం మొత్తం మీద ప్రస్తుతం లాక్ డౌన్ విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా ...? లేకపోతే ఏదైనా ఆంక్షలను విధించి కొనసాగిస్తారా అనేది అందరూ ఎదురుచూస్తున్న అంశం. అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ ప్రాంతాలుగా విడదీస్తూ పాలనను కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 

 


ఇక కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కేసులు పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనితో రాష్ట్రంలో ఏకంగా  రెడ్ జోన్ లో కర్నూల్, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ఉండగా, ఆరెంజ్ జోన్ లో గోదావరి జిల్లాలు, అనంతపురం, ప్రకాశం, కడప, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు, ఇంకా గ్రీన్ జోన్ లో కేవలం విజయనగరం జిల్లా మాత్రమే ఉంది. 

 

ఇక అలాగే తెలంగాణ విషయానికొస్తే గత నాలుగైదు రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో వైరస్ ప్రభావం లేని జిల్లాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య నమోదు వైరస్ వ్యాప్తి ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల కేంద్ర ఆరోగ్యశాఖ విభజించింది. దీని ప్రకారం రెడ్ జోన్ లో మొత్తం ఆరు జిల్లాలు ఉండగా, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు, అలాగే ఆరెంజ్ జోన్ లో 18 జిల్లాలు ఉన్నాయి. ఇక ఏ జిల్లాలు ఏ పరిధిలో వస్తాయో కింది విధంగా ఉన్నాయి.  

 


ముందుగా గ్రీన్‌ జోన్ ‌లోని జిల్లాల విషయానికి వస్తే...  పెద్దపెల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉండగా, రెడ్‌ జోన్ ‌లో హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు, అలాగే ఆరెంజ్‌ జోన్‌ లో నిజామాబాద్‌, జోగులాంబ గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, నారాయణపేట, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్‌, జనగాం, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్‌, జగిత్యాల జలాలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: