ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విజృంభిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతూనే వస్తున్నారు. దీనితో తెలుగు రాష్ట్ర ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజువారీ జీవనం కొనసాగించేవారు కనీసం మూడు పూట్ల అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఇక ఒకవైపు ఈ కరోనా, మరోవైపు వర్షాలు దీనితో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. 

 


ఇక రాబోయే రెండు రోజులలో కోస్తాంధ్ర, రాయలసీమలో... పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు శుక్రవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇక దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది అని.. దీనితో రాబోయే రెండు రోజులలో బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విపత్తుల శాఖ కమిషనర్ తెలియజేశారు. ఇక కోస్తా తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి అని విపత్తుల శాఖ తెలియజేయడం జరిగింది. 


దీనితో పాటు సముద్రంలో ఎక్కువ శాతం  అలజడులు ఉండడంతో మత్స్యకారులు సముద్రం వైపు వెళ్ళకూడదు అని విపత్తుల శాఖ హెచ్చరించడం జరిగింది. ఇక రాబోయే రెండు రోజులలో రాయలసీమలో కూడా పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో మహిళలు, పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ తెలియజేయడం జరిగింది.  ఇక ఉరుములు మెరుపులతో వర్షం కురిసేటప్పుడు రైతులు, కూలీలు, గొర్రెల కాపర్లు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిది అని విపత్తుల శాఖ కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఈ అకాల వర్షాలతో అనేక రైతులు ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: