కరోనా ప్రభావంతో దేశంలో మరణాలు ఎక్కువ అవుతుంటే.. మరో వైపు ఆత్మహత్యలు చేసుకుంటూ  జీవితాలను నాశనం చేసుకుంటున్నారు..లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు తప్పటడుగులు వేస్తున్నారు..పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థిని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే ..

 

 

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడో చదువుతున్న కూతురు ఇంటికొచ్చిందన్న సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఊహించని ఘటనతో షాక్‌కి గురయ్యారు. రాజమండ్రిలోని లూథరన్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న నారాయణరావు, విజయలక్ష్మిల చిన్నకూతురు లీలా లావణ్య నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతోంది.


 

 

కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం కళాశాలలకు సెలవులను ప్రకటించింది.. దీంతో ఇంటికొచ్చిన ఆమె ఈ దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. లాక్‌డౌన్ కారణంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో రాజమహేంద్రవరంలో ఇంటి వద్దనే ఉంటోంది. కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం భోజనం చేసిన లావణ్య తల్లి నిద్రపోతున్న సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పెట్రోల్ డబ్బాతో వంటగదిలోకి వెళ్లి గడియ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.


 

 

 

మంటలు ఎక్కువ కావడంతో తట్టుకోలేక కేకలు వేసింది.. పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలవడంతో తలుపులు బద్దలు కొట్టి లావణ్యను బయటికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె పెట్రోల్ మంటల్లో కాలిపోయింది. ఆమెను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 90 శాతం గాయాలతో పరిస్థితి విషమించి లావణ్య ప్రాణాలు విడిచింది. అయితే సెలవులకు ఇంటికి వచ్చిన కూతురు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం తో ఊరు మొత్తం విషాదంలో మునిగిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి: