కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లుగా టీడీపీ కరోనాని రాజకీయంగా వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే ఛాన్స్ అన్నట్లుగా కరోనాని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే జగన్, టీడీపీ చేసే విమర్శలని పట్టించుకునే పనిలో లేరు. ఆయన కరోనాని కట్టడి చేయడంల, ప్రజలని ఆదుకోవడంలో బిజీగా ఉన్నారు.

 

అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రతిరోజూ బాబు అండ్ బ్యాచ్ కు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు విజయసాయిని టార్గెట్ చేసారు. విజయసాయి విశాఖలో విరాళాల పేరుతో దందాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక వారి కౌంటర్లకు విజయసాయి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.  చందాలు - దందాలు అంటూ చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇరువురి ఆస్తులపై సీబీఐ విచారణకి తాను రెడీ అనీ, చంద్రబాబు రెడీనా అంటూ విజయసాయి సవాల్ విసిరారు.

 

విజయసాయి చేసిన సవాలుకు కూడా టీడీపీ నేతల నుంచి కౌంటర్లు వచ్చాయి. విచారణకి రెడీ ఏంటి రెడ్డి గారు? ఆల్రెడీ జరుగుతుంది కదా మీపై, మీ ఆస్తులపై...? అని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ కౌంటర్ ఇచ్చారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందిస్తూ...ఏంటి విజయసాయి రెడ్డీ సీబీఐ విచారణ అంటున్నావ్?' అని ప్రశ్నించారు. ఇక 16 నెలలు ఊచలు లెక్కపెట్టారని...  ప్రతి శుక్రవారం కోర్టు ముందు నిలబడుతున్నారని ఎద్దేవా చేసారు. అయితే టీడీపీ నేతలకు అదే స్థాయిలో వైసీపీ వాళ్ళు  సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు.

 

విజయసాయి చేసిన సవాలుని టీడీపీ నేతలు బాగానే డైవర్ట్ చేసారని, తాము ఏమి ఉన్న దమ్ముగానే ఎదుర్కొంటామని, అలాఎదురుకోలేకే చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు. దమ్ముంటే విజయసాయి సవాల్ స్వీకరించి సీబీఐ విచారణ చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా చంద్రబాబుపైన లక్ష్మీపార్వతి కోర్టులో కేసు వేశారని, ఎన్నికల అఫడవిఫిట్ ఆధారంగా ఒక్కసారిగా ఆస్తులు పెరగడంపై ఫైల్ చేసిన కేసులో నిజాలు బయటపడతాయిలే అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: