ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నట్లు ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ రాకముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను లోకల్ ఎన్నికల వార్తలు కుదిపేశాయి. కావాలని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లోకల్ ఎన్నికలు జరుగకుండా సొంత నిర్ణయాలతో ఆపేసినట్లు సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

మార్చి నెలాఖరు లోపు ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు వస్తుందని, దాని వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని కుట్రపూరితంగా చంద్రబాబు ఎన్నికలను ఆపేశారు అని జగన్ అప్పట్లో వ్యాఖ్యలు చేయటం మనకందరికీ తెలిసినదే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేయకుండా పోయింది. ఈ లోపు కరోనా వైరస్ రావడంతో ఆ విషయం పక్కన పడిపోయింది.

 

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధి విస్తరణ రోజు రోజుకి పెరుగుతున్న త్వరలో తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు రావడంతో మళ్లీ లోకల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే మే మూడో తారీకు రెండో దశ లాక్ డౌన్ ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ లోకల్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఎందుకోసం ఆల్రెడీ ఎన్నికల సంఘం కూడా రెడీ అయినట్లు తాజాగా కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన కనకరాజు కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: