దేశంలోని అనేక కార్పొరేట్ సంస్థల సీనియర్ ప్రతినిధులతో పాటు పబ్లిక్ పాలసీ రంగంలోని ప్రముఖులు సుమారు 70 మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సమావేశంలో మంత్రి కే తారకరామారావు సంభాషించారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సభ్యులతో మంత్రి కే తారకరామారావు ఈరోజు ఒక వెబినార్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను, చర్యలను వివరించారు. దీంతో పాటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న హెల్త్ కేర్ రంగంలోని మౌలిక వసతులను కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. 

 


ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ  రానున్న సంవత్సరాల్లో భారీ లక్ష్యాల సాధన కోసం పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ సంక్షోభంలోనూ కొత్త అవకాశాలు ఉన్నాయని తాము భావిస్తున్నామని, ముఖ్యంగా భారతదేశ పారిశ్రామిక రంగం ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత ఆపత్కాలంలో భారతదేశం గురించి ప్రపంచ దేశాలు అత్యంత సానుకూల దృక్పథంతో చూస్తున్నాయని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో భారత దేశం ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశం ఇచ్చిందని, ఈ సందర్భంగా దేశానికి ఉన్న బలాలను ప్రపంచానికి ప్రదర్శించే అవకాశం దొరికిందన్నారు. రానున్న రోజుల్లో వీటిని ఉపయోగించుకొని ఫార్మా, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి వంటి రంగాల్లో వేగంగా ముందుకు పోవాలని కోరారు. మంత్రితో జరిగిన ఈ సమావేశం, తాము ఇప్పటివరకు హాజరైన సమావేశాలో ఒక అత్యుత్తమమైనది అని పలువురు మంత్రికి తెలియజేశారు.

 

సంక్షోభం లోనూ అద్భుతమైన ఆలోచనలతో ముందుకు తీసుకుపోయేలా ప్రయత్నిస్తున్నారని మంత్రి కే తారకరామారావు  అభినందించారు. పబ్లిక్ అఫైర్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా గౌరవ సభ్యులుగా ఉండాలని  ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా మంత్రిని పలు అంశాల పైన ప్రశ్నలు అడిగి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: