భాగ్యనగరంలో కరోనా కేసులు పెరగడానికి కారణమేంటి..? మలక్‌ పేట్ మార్కెట్‌ చుట్టుపక్కలే రాకాసి వైరస్ ఎందుకు విజృంభిస్తోంది.? మలక్‌పేట్‌కు వనస్థలిపురానికి ఉన్న లింకేంటి.? నిర్లక్ష్యమే మహమ్మారికి రహదారిగా మరిందా..? 

 

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నా.. హైదరాబాద్‌లో మాత్రం కంట్రోల్ కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు వెయ్యి దాటగా.. ఇందులో 600కు పైగా కేసులు రాజధానిలోనే నమోదయ్యాయి. లాక్ డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతున్నా.. అక్కడక్కడ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎక్కువగా మలక్‌పేటలోనే కరోనా పాజిటివ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో.. అసలు ఇక్కడ కరోనా కేసుల మూలాలపై దృష్టి సారించిన అధికారులు.. కేసులకు గల కారణాల్ని చేధించారు.

 

మలక్‌పేట్ గంజ్‌లో ఓ వ్యాపారికి కరోనా వైరస్ సోకింది. ఆయన ప్రభుత్వాసుపత్రికి వెళ్లకుండా.. వనస్థలీపురంలో ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా ఉన్న తన తమ్ముడి వద్దకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. దీంతో ఆ వ్యాపారితో పాటు ఆయన తమ్ముడి కుటుంబం కూడా వైరస్ భారిన పడింది. 

 

మలక్ పెట్ గంజ్ లో ఉన్న ఓ వ్యాపారికి కరోనా వైరస్ సోకింది. ఆయన ప్రభుత్వాసుపత్రికి వెళ్లకుండా..వనస్థలిపురంలోని తమ్ముడి దగ్గరకు వెళ్లారు. అక్కడే ఉండి, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. దీంతో మలక్ పేట్  వ్యాపారితో పాటు ఆయన తమ్ముడి కుటుంబం మొత్తం కరోనా భారిన పడడం అక్కడ తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతమంతా రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయింది.

 

మొదట వ్యాపారిని రెండు రోజులు అవుట్ పేషెంట్‌గా ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు.. పరిస్థితి విషమించడంతో ఇన్‌పేషంట్‌గా చేర్చుకున్నారు. వైరస్ లోడ్‌ అతని శరీరంలో పెరగిపోయిందని గుర్తించిన వైద్యులు.. తేరుకునే లోపే కుటుంబంలోని అందరికీ వైరస్ సోకింది. కానీ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నాయని, ట్రీట్‌మెంట్ ద్వారా అతడు కోలుకున్నాడని చెబుతున్నారు డాక్టర్. లక్షణాలు గుర్తించి ప్రభుత్వానికి రిపోర్టు చేయకపోగా.. తప్పును కప్పిపుచ్చుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు డాక్టర్.

 

ప్రైవేటు ఆసపత్రి వైద్యుడి నిర్వాకం కారణంగా.. కుటుంబంలోని అందరికీ వైరస్ సోకడమే కాకుండా అతని తండ్రి కూడా చనిపోయాడు. దీంతో ఆ ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కరోనా పేషంట్‌కు ట్రీట్‌మెంట్ ఇచ్చిన వారందరినీ ఐసోలేషన్‌లో పెట్టారు.  కరోనాపై నిర్లక్ష్యం వహించిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక, ఇతర ఆసుపత్రులు అలా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. వనస్థలీపురం ఘటనతో.. అప్రమత్తమైన అధికారులు అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: