గత నెల రోజుల నుండి ప్రతి రోజు తక్కువ సంఖ్యలో  కేసులు నమోదవుతున్న కేరళ లో ఈ రోజు అసలు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. దీనికి తోడు ఈరోజు మరో 9మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 497 కేసులు నమోదు కాగా అందులో 392 మంది కోలుకోగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 102 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయని సీఎం పినరయ్ విజయన్ వెల్లడించారు. ఇదే ట్రెండ్ కొనసాగితే  అతి త్వరలో కేరళ కరోనా ఫ్రీ స్టేట్ కానుంది. 
ఇక ఇదిలాఉంటే వూహించనట్లుగానే లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే 3 తో రెండో దశ లాక్ డౌన్ ముగియనుండగా 4నుండి 17వరకు దేశ వ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే మూడో దశ లాక్ డౌన్ లో రెడ్ జోన్ లో ఎలాంటి  మినహాయింపులు ఇవ్వలేదు కానీ గ్రీన్ అలాగే ఆరెంజ్ జోన్ల లో మాత్రం ఆంక్షలతో  కూడిన సడలింపులు ఇస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ మూడో దశ లాక్ డౌన్ లోనైనా  కరోనా ప్రభావం తగ్గుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: