మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు.. ఎన్నో రకాల కొత్త శిక్షలు అమలులోకి వస్తున్నా కూడా కామాంధుల కామా దాహం మాత్రం తీరలేదు..పసిపిల్లలు ముసలాల్లు అని తేడా లేకుండా కామ కోరికలు తీర్చుకుంటున్నారు..కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడోచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు తెగబడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.



 

 

అసలు విషయానికొస్తే... ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.కామంతో కళ్లుమూసుకుపోయి పదేళ్ల బలికను రేప్ చేశాడు. ఈ దారుణ ఘటన నాదెండ్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులు మిర్చి కోతలకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన ప్రకాశరావు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.



 

 

 

వావి వరుసలు సంగతి అటుంచి 60 ఏళ్ల వయసులో పదేళ్ల చిన్నారిపై బలాత్కారం చేయడం పై చుట్టూ పక్కల వాళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యారు.. అమ్మా నాన్నలు పొలం పనులకు వెళ్ళిన సంగతిని గమనించిన వృద్దుడు.. నెమ్మదిగా ఇంటికెళ్ళి చిన్నారికి మాయమాటలు చెప్పాడు.. దీంతో తాతే కదా అని నమ్మిన పాపానికి కామాకొరికలు తీర్చుకున్నాడు..


 

 

 

తిను బండారాలు కొనిస్తానని ఇంటికి తీసుకెళ్ళాడు.. ఎవరు లేనిది గమినించి నోట్లో గుడ్డ పెట్టి మరి అతి దారుణంగా రేప్ చేశారు.. చిన్నారి జరిగిన విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటకొచ్చింది.. పొలం పనుల నుంచి ఇంటికి తిరిగొచ్చిన తల్లదండ్రులకు విషయం తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నరసరావుపేట లోని ప్రభుత్వాసుపత్రి కి  తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: