ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని చైనాయే సృష్టించిందా.. అది కావాలనే కరోనా వైరస్ ను ప్రపంచంపైకి వదిలిందా.. ఇదంతా ఓ పథకం ప్రకారం పన్నిన కుట్రేనా.. ఈ సందేహాలు చాలా రోజుల నుంచి ప్రపంచానికి ఉన్నాయి. కానీ అందుకు సాక్ష్యాలు ఉండాలి కదా. ఇప్పటికే అమెరికా సహా చాలా దేశాలు చైనా వైఖరిపై గుర్రుగా ఉన్నాయి. కానీ చర్యలు తీసుకునేందుకు తగిన సాక్ష్యాలు లేక మిన్నకుండిపోతున్నాయి.

 

 

కానీ కరోనా వైరస్ వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లోనే పుట్టిందనేందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ బాంబు పేల్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అవును.. ఈ మేరకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని తాజాగా కామెంట్ చేయడం సంచలనానికి దారి తీస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాకింగ్ కామెంట్ కూడా చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థను ఏకంగా చైనా ప్రజా సంబంధాల శాఖగా వర్ణించాడు. ఇంత దారుణంగా వ్యవహరించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిగ్గుపడాలని ట్రంప్ ఘాటుగా విమర్శించారు.

 

 

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ట్రంప్ ఈ మాటలు అన్నది ఎన్నికల ప్రచారంలో కావడంతో కాస్త సీరియస్ నెస్ తగ్గింది. చైనాపై టారిఫ్ లు విధించే దిశగా ఆలోచిస్తున్నట్లు కూడా ట్రంప్ అంటున్నారు. నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోవాలని చైనా కోరుకుంటోందని ట్రంప్ అంటున్నారు. అయితే ఇదంతా ట్రంప్ ఎన్నికల జిమ్మిక్కే అంటున్నారు ఆయన పోటీదారులు.

 

 

ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్ ఎన్ని కబుర్లయినా చెబుతాడని మండిపడుతున్నారు. అమెరికాలో కరోనా కట్టడి చేయలేకపోయిన ట్రంప్.. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చైనాను దెయ్యంలా చూపిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు మండిపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: