కరోనా వైరస్ దేశంలో ఉన్న కొద్దీ విస్తరిస్తోంది. రెండో దశలో కూడా కంట్రోల్ కాకపోవడంతో మే 17వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో చాలా వరకు ఇప్పటికే దేశం ఎక్కువగా నష్టపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలంగా మారింది. లాక్ డౌన్ వల్ల అన్ని రంగాల మూతపడటంతో ఆదాయం లేకుండా పోయాయి. ఎక్కడికక్కడ అన్నిరంగాల్లో స్పందించకపోవడంతో కరోనా వల్ల దేశానికి దాదాపు 35 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల వరకూ నష్టం రావడం జరిగింది.

 

లాక్ డౌన్ వల్ల మొత్తంమీద చూసుకుంటే పది లక్షల నుంచి 12 లక్షల కోట్ల వరకు నష్టం వచ్చి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల దేశంలో పేదలు మరియు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు అనేక అవస్థలు పడ్డారు. అదే సమయంలో ఎక్కువ ప్రభావం ఉపాధిపై పడిందని, దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆదాయం కోల్పోయినట్లు చెప్పుకొస్తున్నారు. దాదాపు  37.3 కోట్ల మంది వర్కర్లు లాక్ డౌన్ లో రోజుకు దాదాపు రూ.10000 కోట్లు కోల్పోయారని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

 

ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారు రెగ్యులర్ క్యాజువల్ వర్కర్లు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. 40 రోజుల లాక్ డౌన్ తో ఏకంగా రూ.4.05 లక్షల కోట్ల నష్టం ఏర్పడిందని పలు లెక్కలు వెల్లడిస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక రంగం తీవ్రంగా నష్టపోయిందని...రాబోయే రోజుల్లో దీని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడిబోతున్నట్లు ఆర్థిక నిపుణులు చెప్పుకొస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: