లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. మరి ఏదైనా ఓకే కానీ అనారోగ్య సమస్యలకు పరిష్కారం ఎలా.. ఆసుపత్రులు కూడా దాదాపుగా మూతబడ్డాయి. అత్యవసర సేవలు మాత్రమే అందుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో సాధారణ రోగుల సంగతేంటి.. ఈ ప్రశ్నలకు సమాధానంగానే ఏపీలో టెలి మెడిసిన్ ద్వారా వైద్యసాయం అందిస్తున్నారు.

 

 

కరోనా సమస్యపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా టెలీ మెడిసిన్ ను తీర్చిదిద్దాలని ఆదేశిచారు. ప్రస్తుతం టెలీ మెడిసిన్‌ద్వారా ప్రిస్కిప్షన్‌ పొందడం, అక్కడనుంచి నేరుగా విలేజ్‌ క్లినిక్‌ద్వారా మందులు సరఫరా చేయాలన్నారు. అంటే టెలిమెడిసిన్ కు ఫోన్ కొట్టి మన జబ్బు వివరాలు చెబితే.. వైద్య నిపుణులు పరిశీలించి తగిన మందులను రాస్తారు. వాటిని విలేజ్ క్లీనిక్ ద్వారా ఇంటికే సరఫరా చేస్తారు.

 

 

అంటే సింపుల్ గా చెప్పాలంటే.. ఫోన్ కొట్టు మందులు పట్టు అన్నమాట. ఇదే సమయలో వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,02,460 కోవిడ్‌ పరీక్షలు చేసినట్లు అధికారులు ఆయనకు తెలిపారు. గురువారం ఒక్కరోజే 7902 పరీక్షలు చేసినట్లు చెప్పారు. కుటుంబ సర్వే లో గుర్తించిన 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు పూర్తిచేసినట్లు అధికారులు జగన్ కు వివరించారు.

 

 

మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తామని అధికారుల వెల్లడించారు. వీరిలో 4 వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్లు తెలిపిన అధికారులు తెలిపారు. వీరికి పరీక్షలు చేసి లక్షణాలు ఉంటే ముందస్తు వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: