పీతల సుజాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా రాణించడం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పీతల సుజాత 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో చంద్రబాబు వెంటనే ఆమెకు మంత్రివర్గాన్ని కేటాయించారు. అయితే ఆ సమయంలో ఎంపీ మాగంటి బాబు మరియు చింతమనేని ప్రభాకర్ తో గొడవలు ఎక్కువగా అవటంతో పీతల సుజాత కి ఉన్న మంత్రి పదవి కోల్పోవటం జరిగింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చురుకుగా వ్యవహరిస్తున్న నాయకురాలిగా పీతల సుజాత పేరు మారుమోగుతుంది.

 

మాగంటి బాబు అనారోగ్యం పాలు కావడం మరోపక్క దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కేసుల గోల తగలడంతో టిడిపి క్యాడర్ చాలావరకూ నీరసించిన స్థితిలో ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి పార్టీలో కీలక నాయకురాలిగా పీతల సుజాత చుట్టూ జిల్లా రాజకీయం నడుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాత గత ఎన్నికలలో బాబు టికెట్ ఇవ్వకపోయినా టిడిపి పార్టీ క్యాడర్ ను  పోగొట్టుకోకుండా వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తుంది.

 

ప్రస్తుతం క‌రోనా నేప‌థ్యంలో స్థానికంగా త‌న వంతుగా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. గ‌తంలో పీత‌ల సుజాతను వ‌ద్దన్న వారు కూడా ఇప్పుడు ఆమెకు జైకొడుతున్నారు. చాలావరకూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లాలో కార్యకలాపాలు ఎక్కువగా చేస్తున్న నాయకురాలిగా పీతల సుజాత పేరు మారుమ్రోగుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: