కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాల్లో మూతపడ్డాయి. మార్చి 22 నుండి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా సౌకర్యం మరియు ఇతర రంగాలు అన్ని క్లోజ్ అయిపోవడంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండో దశలో కూడా కరోనా వైరస్ కంట్రోల్ కాకపోవడంతో మే 17వరకు లాక్ డౌన్ కేంద్రం ఇటీవల పొడిగించింది.

 

అయితే ముందు నుండి మందుబాబులు తెగ అవస్థ పడుతున్న తరుణంలో గ్రీన్ జోన్లలో మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రకటనతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు మందుబాబులు. కానీ కొన్ని షరతులు పెట్టింది.

 

మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని, ఐదుగురుమించి షాపు వద్ద గుమి కూడరాదని, ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలని కేంద్రం తెలిపింది.. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో మద్యం, పాన్ గుట్కా, పొగాకును బహిరంగ ప్రదేశాల్లో వినియోగించరాదని కేంద్రం సూచించింది. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని ఆదేశించింది.  ఇదే సమయంలో వివాహం చేసుకోవచ్చునని, కానీ 50 మందికి మించి హాజరు కాకూడదని, ఉండరాదని తెలిపింది. అంతేకాకుండా అంత్యక్రియల సమయంలో 20 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. మే 4 నుండి ఇవన్నీ అమలులోకి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చెప్పుకొచ్చింది. 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: