కరోనా పై పోరాటం విషయంలో అన్ని రాష్ట్రాల తీరు ఒకలా ఉంటే మొదటి నుంచి పశ్చిమబెంగాల్ తీరు మరొకలా ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంతో సరిగ్గా సహకరించడం లేదని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇంకా తన రాష్ట్రంలో నమోదైన కేసులు కంటే చాలా తక్కువ నెంబర్లను చూపిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదీ కాకుండా తనకు నచ్చినట్టు లాక్ డౌన్ ను అమలు చేయడం వంటి పనులు చేస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు.

 

ఇలాంటి సమయంలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో రెడ్ జోన్‌లు, కోవిడ్‌ 19 హాట్ స్పాట్స్ లిస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. మీ రెడ్ జోన్ల లిస్టులో తప్పులున్నాయంటూ దీదీ కొత్త జాబితాను కేంద్రానికి పంపించారు.

 

మీ లిస్ట్ మీ దగ్గరే ఉంచుకోండి మా లిస్టు తీసుకోండని దీదీ అన్నారు. బెంగాల్‌లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జాబితాకు సంబంధించి తప్పులున్నాయని.. రాష్ట్రంలో దాదాపు 10 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించారని తెలిపారు.

 

అంతేకాకుండా సొంతంగా జాబితాను తయారు చేసి కేంద్రానికి పంపించారు. విషయమై బెంగాల్ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వివేక్ కుమార్ ప్రస్తుత పరిస్థితులు, కరోనా కేసులను బట్టి రాష్ట్రంలో కేవలం 4 జిల్లాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయని.. అవి కూడా కలకత్తా, హౌరా, నార్త్-24 పరగణాస్, పూరబ్ మెదినీపూర్‌ అని కూడా వివేక్ కుమార్ లెటర్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: