ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతున్నా సీరియస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో కరోనా లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 
 
కరోనా తీవ్రత ఉన్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కేసుల సంఖ్య 6 శాతంగా ఉండగా ప్రస్తుతం 2 శాతానికి తగ్గడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 లక్షల కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 2,50,000 కు చేరువలో ఉంది. వైద్యులు మానవుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుండటం వల్లే కరోనా తీవ్రమైన కేసుల సంఖ్య తగ్గుతోందని చెబుతున్నారు. 
 
కొన్ని దేశాల్లో కరోనా కంట్రోల్ అవుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో 11 లక్షల మంది కరోనా భారీన పడగా 65,000 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు భారత్ లో కరోనా కేసుల సంఖ్య 35,000 దాటింది. ఇప్పటివరకు 9000 మందికి పైగా కరోనా నుంచి డిశ్చార్జ్ కాగా మృతుల సంఖ్య 1152కు చేరింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోవదువుతూ ఉండగా ఏపీలో మాత్రం వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఏపీలో నిన్న 60 కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1463కు చేరింది. రాష్ట్రంలో 33 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు తెలంగాణలో నిన్న 6 కొత్త కేసులు నమోదు కావడం బాధితుల సంఖ్య 1044కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 28 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: