ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు తగిన జాగ్రత్తలు చెబుతూనే కొత్త రూల్స్ తీసుకొస్తున్నాయి.. ఇప్పటికే నో మాస్క్ నో పెట్రోల్, నో మాస్క్ నో రేషన్ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.. ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పని సరి.. ఒక వేళ ఏం అవుతుందిలే అని మాస్క్ లేకుండా వెళ్లితే వెనక్కి పంపేస్తారన్నమాట. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇలా ప్రతి చోట తగిన జాగ్రత్తలు పాటిస్తుండగా ఏటీఎం లలో మాత్రం కొందరు ఆకతాయిలు కావాలని ఏటీఎం మిషిన్లను పాడుచేస్తున్నారు..

 

 

అందుకే కరోనా వ్యాప్తి కట్టడికి బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఏటీఎంల విషయంలో. బ్యాంకు ఏటీఎంలు, పెన్షన్‌దారులకు సంబంధించి మే 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అవేంటంటే.. కరోనా నేపథ్యంలో ఏటీఎంను వినియోగించిన ప్రతిసారి శుభ్రం చేయాలి. అంతే కాకుండా హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఉన్న  ఏటీఎంలను స్థానిక మున్సిపల్‌ సిబ్బంది రోజుకు రెండుసార్లు శానిటైజ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఎవరైన ఈ నిబంధన పాటించడం లేదని తెలిస్తే మాత్రం ఆ ఏటీఎం కేంద్రాలను మూసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు..

 

 

ఇకపోతే కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బులు లేక చాలమంది ఇబ్బందులు పడుతున్నారు.. ఒకవేళ ప్రభుత్వం వేసిన డబ్బులు గాని, పెన్షన్‌ గాని వచ్చే వారు డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి, తమ చేతులతో వాటిని టచ్ చేస్తారు. అయితే వారిలో ఎవరికైనా కరోనా ఉండి ఉంటే, అది ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కరోనా వ్యాప్తికి ఏటీఎంలు ప్రధాన మార్గాలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్న బ్యాంకులు కొత్త నిబంధన తీసుకొచ్చాయి. ఏటీఎం కేంద్రాలను శానిటైజ్ చేయాలని రూల్ పెట్టారు. ఆ విధంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నాయి.. కాబట్టి ప్రజల్లారా మీరు వెళ్లే ప్రతిచోట చాలా అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించండి.. కరోనా బారినుండు కాపాడుకోండి..  

మరింత సమాచారం తెలుసుకోండి: