దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం సడలింపులు ఇవ్వడంపై డబ్ల్యూహెచ్‌ఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు నిబంధనలను సడలించవద్దని సూచిస్తోంది. పలు దేశాలు కరోనా కట్టడి కొరకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించింది. లాక్ డౌన్, భౌతిక దూరం మాత్రమే కరోనాను కట్టడి చేయగలవని... అమెరికా, భారత్ లాంటి దేశాలు లాక్ డౌన్  సడలింపులు విధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని... లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన దేశాల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు. నిబంధనలను ఎత్తివేయాలని అనుకునే దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచనలు చేశారు. చైనాలో సామాజిక దూరం పాటిస్తూ కరోనా కట్టడిలో చైనీయులు సక్సెస్ అవుతున్నారని పేర్కొన్నారు. 
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 37,000 దాటింది. మహారాష్ట్ర రాష్ట్రంలోనే కరోనా కేసుల సంఖ్య 10,000 దాటడం గమనార్హం. గుజరాత్, ఢిల్లీలో కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లో వైరస్ ప్రభావం బట్టి కేంద్రం మూడు జోన్లుగా విభజించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రం 130 రెడ్ జోన్లను ప్రకటించింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: