జెఫ్ బెజోస్... ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ స్టోర్ అధినేత కాబట్టి. అయితే ఈయన ప్రస్తుతం అమెరికాలో మరొకసారి చిక్కుల్లో పడ్డాడు. ఆయనపై అమెరికాలో అమెజాన్ కంపెనీ చేసిన ప్రకటనలో తప్పుదోవ పట్టించేదిగా ఉన్నాయని ఆరోపణలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై స్వయంగా జెఫ్ బెజోస్ హాజరై తన సాక్ష్యం ఇవ్వాలని అని అమెరికా అధికారులు ఆయన హెచ్చరించారు.

 


తప్పుదోవ పట్టించే ప్రకటనలపై విచారణ ఇవ్వాల్సిందిగా దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆయన స్వతహాగా హాజరు కాకపోతే ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రెండు పార్టీలకు చెందిన హౌస్ జ్యుడీషియల్ కమిటీ నాయకులు అమెజాన్ సంస్థ సీఈవో కు శుక్రవారం నాడు ఒక లేఖ రాశారు. స్వచ్ఛందంగా ప్రతిపాదన సాక్ష్యం కోరుకుంటున్నామని అందులో తెలపబడింది.. 

 


అసలు అమెజాన్ తన మార్కెట్ ప్లేస్ లో అమ్మకం వ్యక్తుల గురించి వాటి ఉత్పత్తుల లావాదేవీల గురించి కలిగిన సమాచారాన్ని దాని సొంత పోటీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి అమెజాన్ సంస్థ ఉపయోగించింది అని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక నివేదించింది. అయితే అమెజాన్ ఎగ్జిక్యూటివ్ గత సంవత్సరం జూలైలో జరిగిన కమిటీ విచారణలో దీన్ని తోసుబుచారు. అయితే అమెరికాలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ముఖ్యంగా నాలుగు టెక్ దిగ్గజాల గత కొన్ని రోజుల నుంచి ఆంటీ ట్రస్ట్ విచారణను జరుగుతున్నాయి. డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని యాంటీ ట్రస్ట్ ఫేస్ బుక్, గూగుల్, ఆపిల్, అమెజాన్ దిగ్గజాల పై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. అలాగే వినియోగదారులపై ఎటువంటి ప్రభావం పడుతుందో సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.

 

 

అయితే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికను అడ్డంగా పెట్టుకుని తప్పుడు పద్ధతులను చేస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ప్రస్తుతం అమెజాన్ కంపెనీ భారీగా ఎదురు దెబ్బలను ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: