తెచ్చిపెడుతుందో చెప్పక్కర్లేదు. మార్చి 22 వ తేదీ నుంచి ఇండియాలో దాదాపుగా లాక్ డౌన్ అమలు జరుగుతూనే ఉన్నది. మార్చి 22 వ తేదీన జనతా కర్ఫ్యూ విధించారు. ఈ జనతా కర్ఫ్యూ తరువాత ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం.  ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత గుర్తుంది కదా.. ఈ లాక్ డౌన్ వల్ల వివాహాలు ఆగిపోయాయి.. ఒకవేళ చేసుకున్నా ఏదో ఒక కేసు లో ఇరుక్కుంటున్నారు.  మరికొన్ని చోట్ల కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 

 

 

రీసెంట్ గా ఒంటరిగా వెళ్లి.. బైక్ పై తన అత్తమామలను ఒప్పంచి పెళ్లిచేసుకొని తన ఇంటికి వెళ్లాడు ఓ పెళ్లికొడుకు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు లాక్ డౌన్ నేపథ్యంలో పెళ్లిళ్ల విషయంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ జంట ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవడతో వరుడు ఏకంగా ఫోన్‌కు తాళి కట్టాడు. బంధు మిత్రుల కోలాహలం మధ్య జరగాల్సిన పెళ్లిలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. వీటిలో కూడా వింతలూ విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి.  మరికొంత మంది ఇంత టెన్షన్ వాతావరణంలో పెళ్లి ఎందుకని క్యాన్సల్ చేసుకుంటున్న వారు ఉన్నారు. 

 

తాజాగా మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. భౌతిక దూరం పేరుతో వధూవరులు ఇద్దరు కర్రల సాయంతో దండలు మార్చుకున్నారు.  భౌతిక దూరం పాటిస్తూ.. కర్రల సాయంతో దండలు మార్చుకున్నారు. ఇలా వారు దండలు వేసుకుంటూ ఉండగా తీసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అమ్మాయి, అబ్బాయి కర్రతో కొట్టుకుంటున్నారేమో అనే అనుమానం వచ్చేలా ఇవి ఉన్నాయి.  కాగా ఇప్పటికే చాలా మంది పెళ్లిలు, శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. కొంత మంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ఏకమౌతున్నారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: