దేశంలో ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో అక్కడ కరోనా మహమ్మారి మనుషులకు ఇట్టే అంటుకుపోతుంది.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో రెడ్ జోన్లలో ఎంతో సీరియస్ గా వ్యవహరిస్తున్నారు.  ఇక కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఢిల్లీలో లాక్ డౌన్ కఠినంగానే నిర్వహిస్తున్నారు.. కానీ ఇక్కడ మాత్రం కరోనా తగ్గడం లేదు. ప్రతిరోజూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి.  మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే కరోనా లక్షణలు కొన్ని వెంటనే బయట పడకపోవడం వల్ల అప్పటికే ఆ వైరస్ వచ్చిన వారు ఇతరులను కలవడం వారికి తర్వాత వైరస్ ఎటాక్ చేయడం జరుగుతుందని అంటున్నారు.  

 

అందుకే సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ ఉండాలని.. ఎవరిని ఎక్కువ తాకవద్దని.. కరోనా లక్షణాలు అనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని అంటున్నారు. తాజాగా  ఢిల్లీలోని కాపస్ హీరాలో నివసిస్తున్న దాదాపు 41మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. అయితే ఈ 41మందిలో చాలామంది ఒకే బిల్డింగ్ లో నివసిస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్-19న కాపస్ హీరాలో నివసిస్తున్న ఓ వ్యక్తికి మొదటగా కరోనా పాజిటివ్  వచ్చింది. ఢిల్లీ కపాషెరా ప్రాంతంలోని ఒక బిల్డింగ్​లో నివాసం ఉంటున్న 41 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికారులు శనివారం మీడియాకు తెలిపారు.

 

ఇదే భవనంలో ఉంటున్న ఒకరికి ఏప్రిల్ 18న కరోనా సోకడంతో మిగతా వారందరి శాంపిల్స్ కలెక్టు చేసుకుని ముందు జాగ్రత్త చర్యగా బిల్డింగ్ ఖాళీ చేయించామన్నారు.   ఆ ఒక్క వ్యక్తి నుంచే ఇదంతా జరిగిందని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 3515 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు అక్కడ మొత్తం 59 మంది మరణించారు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కంటైన్మనెంట్ జోన్లను గుర్తించి లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: