ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధానాన్ని మళ్ళీ పొడిగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనితో ప్రజలు ఆర్థికపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నరూ అనే  చెప్పాలి. ఇక వలస కార్మికుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.  అనేక ప్రాంతాలలో చిక్కుకుని పోయిన వలస కార్మికులు అయితే దిక్కుతోచని స్థితిలో ఉన్నారనే చెప్పాలి. ఇక  వలస కార్మికులకు వారి సొంత ఊర్లకు చేరడానికి ఏ చిన్న అవకాశం లభించినా కూడా వదులుకునే పరిస్థితి కార్మికులు లేరు అనే చెప్పాలి.

 


 ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్లో హైవే పై వెళుతున్న సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా పోలీసులకు ఒక ఆశ్చర్యకరమైన విషయం  బయట పడిందనే చెప్పాలి. ఒక రకంగా ఆ మిక్సర్ ట్యాంకులో ఉన్న వారిని చూసి పోలీస్ అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు అనే చెప్పాలి. ఆ మిక్సర్ బ్యాంకులో 18 మంది వలస కార్మికులు ఉన్నట్లు పోలీస్  అధికారులు గ్రహించడం జరిగింది.

 


ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతానికి మీరందరూ వెళ్తుండగా ఇండోర్ ఉజ్జయిన్ జిల్లాలో పోలీస్ అధికారులు వారిని అడ్డుకోవడం జరిగింది. వాస్తవానికి వాహనం ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడగడంతో డ్రైవర్ సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. దానితో అనుమానం వచ్చి పోలీస్ అధికారులు సోదాలు చేయగా. మిక్సర్ ట్యాంక్ లో వలస కార్మికులు దర్శనమిచ్చారు. ఇక  ట్రక్ డ్రైవర్ పై పోలీస్ అధికారులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కార్మికులందరినీ కూడా ఫారం టైం కేంద్రానికి తరలించడం జరిగింది. ఇక వలస  కార్మికుల అందరికీ కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి స్వస్థలానికి పంపించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: