ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ స్ట్రిక్ట్‌గా అమ‌లు అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లు గ‌త నెల రోజుల‌కు పైగా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కూడా సాహ‌సించ‌డం లేదు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఈ లాక్‌డౌన్ మ‌రో రెండు వారాల పాటు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే కేర‌ళ‌లోని ఓ కుటుంబం ఏకంగా మూడేళ్ల పాటు లాక్‌డౌన్‌లో ఉంటోంది. మూడేళ్లుగా ఈ కుటుంబం అస్స‌లు ప్ర‌పంచంతో సంబంధం లేకుండా త‌మ పొలంలో ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటోంది. ఇంకా చెప్పాలంటే ఈ కుటుంబం అస‌లు ప్ర‌పంచంతో సంబంధం లేకుండా ఉంటుంది. 

 

కేరళకు చెందిన ఎల్డన్‌ పచ్చికడన్‌ కుటుంబం. ఎల్డ‌న్ స్వ‌త‌హాగా ఆర్కిటెక్ట్‌. ఆయ‌న ఇడుక్కి ప్రాంతంలో ప‌ది ఎక‌రాల భూమి కొన్నారు. అక్క‌డ గ‌త కొన్నేళ్లుగా 200 ర‌కాల పండ్లు, కూర‌గాయాలు సాగు చేస్తున్నారు. అయితే స్వ‌త‌హాగా  ఎల్డ‌న్‌కు ప్ర‌శాంతంగా ఒంట‌రిగా ఉండ‌డం అంటే ఇష్టం. ముందుగా అక్క‌డే చిన్న ఇళ్లు క‌ట్టుకుని అక్క‌డే ఉండిపోయారు. ఇక అక్క డ ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డిన ఎల్డ‌న్ కుటుంబంతో స‌హా అక్క‌డికే మారిపోయాడు.

 

ఇలా మార‌డం వెన‌క ఎల్డ‌న్‌కు ఓ ప్లాస్ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. 9 ఏళ్ల క్రితం ఎల్డ‌న్ ఓ ప‌నిమీద త్రివేండ్రం వెళ్లాడు. అక్క‌డ ఆర్గానిక్ ఫామింగ్ గురించి విన్నాడు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌ట‌కి అయినా పొలంలో ఇళ్లు క‌ట్టుకుని ప్ర‌శాంతంగా ఉండాల‌నుకుని అక్క‌డే సెటిల్ అయిపోయాడు. తొలుత సెల‌వుల‌కు మాత్ర‌మే పొలంలోకి వ‌చ్చి కొన్ని రోజులు ఉండి వెళ్లేవారు. ఆ త‌ర్వాత త‌న భార్య .. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఇక్క‌డే సెటిల్ అయిపోయాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్ర‌పంచం అంతా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నా త‌మ కుటుంబానికి ఏం ఇబ్బంది లేద‌ని... గ‌త కొన్నేళ్లుగా త‌మ‌కు ఇది అలవాటుగానే మారింద‌ని ఎల్డ‌న్ చెపుతున్నాడు.

 

ఇక ఇప్పుడు ఎల్డ‌న్ కుటుంబం గురించి ఈ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ కుటుంబం మ్యాట‌ర్ నేష‌న‌ల్ వైడ్‌గా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: