మధ్య ప్రదేశ్ మాజీ మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్‌ చేసిన ఒక పని ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో గురువారం రోజు ఒక వ్యక్తి రోడ్డు మీద యదేచ్ఛగా ద్విచక్ర వాహనం నడుపుతూ వెళ్తుంటే పోలీసులు అతడిని ఆపారు. మాస్కు కూడా ధరించకుండా ఎక్కడికి వెళ్తున్నావ్? అని పోలీసులు అతడిని ప్రశ్నించగా... సదరు యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ' మీరు ఎవరిని ఆపి ఏం అడుగుతున్నారు తెలుసా? అసలు నేను ఎవరి కొడుకునో మీకు తెలుసా?' అంటూ పోలీసుల పై విరుచుకుపడుతూ నోరు పారేసుకున్నాడు. అయితే ఈ యువకుడు పోలీసుల ని బెదిరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.


ఆ వీడియోలో పోలీసుల పై విరుచుకు పడుతున్న యువకుడు తన కుమారుడేనని తెలుసుకున్న మాజీ మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అనంతరం సదరు మంత్రి తన కుమారుడైన రిపుదమాన్‌ ని సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి అతడితో బాధిత పోలీసులకి క్షమాపణ చెప్పించి... జరిమానా కూడా కట్టారు. తర్వాతి రోజు తన కొడుకు కి గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో అతడితో మునిసిపల్ కార్మికులు చేసే పనిని చేయించారు. రహదారులపై చెత్తని తన కుమారుడితో ఎత్తించారు.

 

చివరికి మూత్రశాలలను కూడా తన కుమారుడితో కలిగించడంతో పాటు... కొడుకు చేసిన తప్పుకి తనని తాను శిక్షించుకుంటూ ఆయన కూడా దొడ్లు కడిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్‌ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ తానే స్వయంగా రోడ్లను పరిశుభ్రం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తప్పు చేసింది తన సొంత కొడుకు అయినప్పటికీ... అతడికి శిక్ష విధించి తన హుందా తనాన్ని చాటుకున్న ఈ మంత్రి ని అందరూ కొనియాడుతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం నిజంగా అరుదైనది అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: