రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి. ఎప్పుడు రాజకీయాలు చేయాలో ఎప్పుడు చేయకూడదో కనీస స్పృహ లేకుండా నాయకులు వ్యవహిరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒకవైపు కరోనా వైరస్ ఏపీని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ ప్రభావం నుంచి ఎప్పుడు బయటపాఠమో తెలియని పరిస్థితి. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా ఒకరికొకరు సహకరించుకోవాల్సిందిపోయి ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవైపు కరోనా బీభత్సం చేస్తోంది. నిత్యం అరవై డెబ్భై కేసులకు తక్కువ కాకుండా నమోదవుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనూ ఏపీలో రాజకీయ విమర్శలతో పార్టీల మధ్య రాజకీయ వైరం ముదురుతూ వస్తోంది. అసలు ఒకరికొకరు సహకరించుకోవడం అనే విషయం పక్కనపెడితే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం నిత్యకృత్యంగా మారింది. 

 

IHG


అసలు ఏపీలో కరోనా కంటే తీవ్ర స్థాయిలో రాజకీయం మొదలయ్యింది. అధికార పార్టీ వైసీపీ కరోనా విషయంలో స్పందిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. దీనికి స్పందనగా వైసీపీ కూడా టీడీపీ పై అదే స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తోంది. లాక్ డౌన్ నిబంధనలను అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా టీడీపీపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తోంది తామేనని వైసీపీ ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసుకుంటోంది.


 ఈ విషయంలో ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సోషల్ మీడియా వేదికగా సమాధానం చెబుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో కరోనాపై పోరులో భాగంగా అధికార విపక్ష పార్టీలు అన్నీ కలిసి కట్టుగా కరోనాను ఎదుర్కుంటూ ఉండగా, ఏపీలో మాత్రం రాజకీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికార పార్టీకి క్రెడిట్ రాకుండా టీడీపీ , జనసేన, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.


 కరోనాపై పోరులో ఏపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుండగా, విపక్షాలు మాత్రం రాజకీయ విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మేలు జరిగే విషయంలోనూ విమర్శలు చేస్తుండడంపై విపక్షాల తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: