రేపటితో దేశ వ్యాప్తంగా రెండోదశ లాక్ డౌన్ ముగియనుండగా 4నుండి మూడో దశ లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే రెండో దశ లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్రం మూడో లాక్ డౌన్ లో మాత్రం గ్రీన్ ,ఆరేంజ్ జోన్ల లో చాలా వరకు సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా ఈ రెండు జోన్ల లో వైన్స్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చని తెలియజేసింది. అయితే ఒకేసారి కేవలం 5గురు మాత్రమే కొనుగోలు చేసేలా అది కూడా సోషల్ డిస్టాన్స్  పాటిస్తూ  కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించింది. ఇక ఆయా  రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం వైన్స్ షాపుల ఓపెన్ పై ఇంకా ప్రకటన చేయలేదు కానీ  తాజాగా  కర్ణాటక ప్రభుత్వం మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
కంటామినేట్ జోన్ల లో తప్పించి మిగితా  అన్ని జోన్లలో  మాల్స్ కు అనుబంధం లేకుండా వుండే సింగిల్ వైన్ షాపులను ఓపెన్ చేసుకోవచ్చని కర్ణాటక ఏక్సైజ్ శాఖ మంత్రి నగేష్ వెల్లడించారు. మే 4నుండి ఉదయం 9గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపుల కు అనుమతిస్తున్నామని అయన క్లారిటీ ఇచ్చారు. మరి మిగితా రాష్ట్రాలు కూడా ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన  మినహాయింపును అమలు పరుస్తాయా లేదనేది ఆసక్తిగా మారింది. 
 
ఇక ఇదిలావుంటే రోజులు గడుస్తున్న దేశవ్యాప్తంగా  కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజుల నుండి భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2411 కరోనా కేసులు 71 మరణాలు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 37776కు చేరింది. మొత్తం ఇప్పటివరకు 1223 మరణాలు సంభవించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: