ఐదేళ్లు అధికార పీఠం మీద ఉండి అలవాటైపోయిందేమో తెలియదు గానీ, 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా ఊహించని ఓటమి రావడంతో, టీడీపీ నేతలు ఉండలేకపోతున్నారు. ఒక్కసారిగా అధికారం కోల్పోవడం, చంద్రబాబు కంటే చాలా జూనియర్ అయిన జగన్ తొలిసారి సీఎం కావడంతో తట్టుకోలేకపోతున్నారు. దీంతో జగన్ సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి, ఆయనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

 

పాలనలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెబుతూ, చంద్రబాబు ఏదోరకంగా విమర్శలు చేయడమో, పోరాటాలు చేయడమో చేస్తున్నారు. అలాగే జగన్ తీసుకొచ్చే ప్రతి పథకంపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కూడా టీడీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తూ, జగన్ ని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు.

 

అసలు కరోనా కట్టడి చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారంటూ, ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి, నానా హంగామా చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా సైతం జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూనే ఉంది. ఎలాగోలా జగన్ ని అధికారానికి దూరం చేసి, చంద్రబాబు ఎలాగైనా సీఎం పీఠం ఎక్కేయాలని చూస్తున్నారు. ఇక ఆ విషయం టీడీపీ నేతల్లో స్పష్టంగా అర్ధమవుతుంది.

 

టీడీపీ నేతలు మాట్లాడితే చాలు, మీకు కరోనాని కట్టడి చేయడం చేతకాకపోతే చెప్పండి చంద్రబాబు ఏదో పొడిచేస్తారని డప్పు కొడుతున్నారు. తాజాగా కూడా మీకు ప‌రిపాల‌న చేత‌కాకపోతే నెల రోజుల పాటు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకోవాలని బోండా ఉమా లాంటి వారు మాట్లాడుతున్నారు. ఇంకా కావాలంటే ఓ నెల రోజులు చంద్ర‌బాబుకి ప‌రిపాల‌న అప్ప‌గించాలని అంటున్నారు.

 

అయితే టీడీపీ నేతలకు అధికారం లేక పిచ్చెక్కుతుందని, వారికి దోచుకోవడానికి అవకాశాలు లేక, ఇలా నెల రోజులు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కానీ అలాంటి అవకాశాలు టీడీపీకి భవిష్యత్ లో కూడా రావని, జగన్ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: