ఆర్ధిక పరిస్థితులు సరిగా లేకపోయిన సీఎం జగన్, ఇటీవల డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ. 1400 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సున్నా వడ్డీ పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ పథకం ఎప్పటి నుంచో అమలవుతూ వస్తుందని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా ఈ పథకం అమలైందని, అలాంటిది జగన్ ఏదో కొత్తగా పథకం అమలు చేస్తున్నట్లు చెబుతున్నారని మండిపడుతున్నారు.

 

ముఖ్యంగా తెలుగుమహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ విషయంపై కాస్త సీరియస్ గానే ఉన్నారు. పథకం అమలైన రోజే, మహిళలని మోసం చేయడానికి ఈ పథకం తీసుకొచ్చారని విమర్శించారు. డ్వాక్రా రుణమాఫీని ఎగ్గొట్టడానికి ఇలా ప్లాన్ చేసారని అన్నారు. అలాగే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పారని గుర్తు చేస్తున్నారు.

 

అయితే జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా దశల వారీగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అనేక పథకాల్ని ప్రవేశపెట్టారు కానీ, డ్వాక్రా రుణమాఫీని అమలు చేయలేదు. దీనికోసం డ్వాక్రా మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు సున్నా వడ్డీ పథకం తేవడంతో, రుణమాఫీ విషయం తెరమీదకొచ్చింది. దీంతో టీడీపీ నాయకురాలు అనిత ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. తాజాగా కూడా డ్వాక్రా రుణమాఫీ ఏమైందని అడుగుతూనే,  మీ చెల్లి ద్వారా అధికారంలోకి వచ్చిన విషయం.. మీ మదిలో మెదులుతూ ఉంటే, మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ వెంటనే అమలు చేయాలని జగన్ ని డిమాండ్ చేసారు.

 

అంటే జగన్ హామీ ఇచ్చేప్పుడు డ్వాక్రా అక్కాచెల్లెలకు రుణమాఫీ చేస్తానని అన్నారు. ఇక ఆ విషయాన్ని షర్మిలకు అన్వయిస్తూ, జగన్ కోసం ఎన్నికల ప్రచారం చేసింది కాబట్టి, ఆమెని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ చేయాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేదు కాబట్టి, రుణమాఫీ ఇప్పటిలో చేయడం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: