కేసిఆర్ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా వైరస్ తెలంగాణలో విస్తరిస్తూనే ఉంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేస్తున్నా గాని వైరస్ కేసులు ఒక పక్క నమోదవుతున్న తరుణంలో తెలంగాణ ప్రజలలో భయాందోళనలు నెల కొంటూనే ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో తెలంగాణాకి తలనొప్పిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో కంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ మరియు టిడిపి నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఏపీ జనాలు కూడా విస్తుపోతున్నారు.

 

ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇతరులను విమర్శించే విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. కాగా తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు నిప్పుమీద కిరసనాయిలు పోసినట్లయింది. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రజలు మర్చిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

 

తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదు అవ్వటానికి కారణం తెలంగాణ సర్కార్ అవలంభిస్తున్న తీరు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఇదే సందర్భంలో బండి సంజయ్ వ్యాఖ్యలకు టిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. దీంతో ఏపీ మాదిరిగా తెలంగాణలో కూడా రాజకీయం తలనొప్పిగా మారింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: