దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించింది కేంద్రం. అయితే కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనుంది. ఐదో తేదీన జరిగే కేబినెట్ మీటింగ్ లో... కేసీఆర్ ఏం నిర్ణయించనున్నారు. ప్రస్తుతం అందరి చూపు దీనిపైనే ఉంది.

 

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించింది కేంద్రం. దేశంలోని జిల్లాలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి.. ఏ జోన్ లో ఎలాంటి మినహాయింపులుంటాయో క్లారిటీ ఇచ్చింది. స్థానిక పరిస్థితిని బట్టి అమలుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. అయితే తెలంగాణ లో మినహాయింపు లు ఉంటాయా.. లాక్ డౌన్-2 మే మూడో తారిఖున ముగుస్తుండగా.. తెలంగాణ లో మాత్రం మే ఏడో తేదీవరకూ ఉండనుంది. మరి సీఎం కేసీఆర్  ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశముంది.?

 

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా, సభలు, సమావేశాలు, విద్యా సంస్థలు, హోటల్స్, రెస్టారెంట్, బార్స్, మాల్స్ కి అనుమతి లేదు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ లలో... జోన్ ల వారిగా కొని మినహాయింపులు ఇచ్చింది కేంద్రం.... తెలంగాణ లో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. అందులో హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో మూడో వంతు పైగా పబ్లిక్ ఇక్కడే ఉంటారు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముందన్న అంశంపై చర్చ జరుగుతోంది...  ప్రస్తుతం 20 శాతం ఉద్యోగులతో నడుస్తున్న ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగుల శాతం పెంచుతారా... ? ప్రైవేట్ ఆఫీస్ లకు అనుమతి ఇస్తారా...? నిత్యావసర దుకాణాలు కాకుండా మిగతా వ్యాపారాలకు అనుమతి ఉంటుందా..? గ్రేటర్ పరిధిలో ఉన్న కంపెనీ లు, పరిశ్రమల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? అన్న అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

 

ఈ నెల ఐదో తేదీన జరిగే కేబినెట్ భేటీ తర్వాతే.. ఆయా అంశాలపై  పూర్తిస్థాయి స్పష్టత రానుంది. పదో తరగతి పరీక్షలు, ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ నిర్వహించాల్సి ఉంది..ఈ అంశాలపై  కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రీన్ జోన్ లలో మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చేది లేనిది కూడా అదే రోజు డిసైడవుతుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లు.. ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్లేందుకు అనుమతి ఇస్తారా అన్న అంశంపైనా పక్కా క్లారిటీ రానుంది. అలాగే .. గ్రీన్ జోన్ లలో బస్సులు నడిచేది లేనిది తేలనుంది.

 

మరోవైపు...కేంద్ర మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు..  దృష్టి పెట్టారు.. ఇప్పటికే సీఎస్... అధికారుల తో చర్చించారు... రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాల్సిన మార్గ దర్శకాలు, కేబినెట్ ముందు పెట్టాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు... అయితే కేంద్రం ప్రకటించిన జోన్ ల ప్రకారం కాకుండా...స్థానిక పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతాలను గుర్తించి ఎక్కడ ఎలాంటి మినహాయింపు లు ఇవ్వాలో రాష్ట్రప్రభుత్వం డిసైడ్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: