కాలం కరోనా చేసిన గాయంతో కన్నీళ్లు పెడుతుంది.. లెక్కలేనన్ని హృదయాలు ఆవేదనతో ఘోషిస్తున్నాయి.. దర్పంతో బ్రతికిన దేహాలు వైరస్ బారినపడి దిక్కులేని శవాల్లా పంచభూతాల్లో కలిసిపోతుంటే.. నీ అన్నవాళ్లే నిన్ను ఒంటరిని చేసి వదిలేసిన క్షణాన.. నా గర్బాన్ని తూట్లు పొడిచి, మురికి కూపంగా మార్చి, నన్ను అమ్ముకుని నీ పబ్బం గడుపుకున్న మనిషి ఏనాటికైనా మళ్లి నా ఒడిలోకి రావలసిందే అని ఈ ధరణి బుద్ధి చెప్పే గురువులా కనిపిస్తుంది.. మనుషులుగా బ్రతికే మీకు కులాలు మతాలు ఉంటాయి కావచ్చూ కానీ మిమ్మల్ని బ్రతికించే మాకు ఏ కులాన్ని అంటగడతారని ప్రశ్నిస్తుంది..

 

 

లోకంలో అమ్మతనంలో మార్పులు వస్తుంటే, ప్రాణం ఉన్న బొమ్మలా నాన్న మారుతుంటే.. కలికాలమే కానీకాలంలా మారుతుంటే.. ఎవరి కష్టాలు ఎవరికి పడుతాయి.. పొట్టనిండి బొజ్జపెంచిన వాడే ఇంకా ఆకలి అని ఆవురావురుమంటుంటే .. నిజంగా ఆకలితో ఉన్న వాడికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది.. అందులో కరోనా అరివీర భయంకరంగా మనుషుల ప్రాణాలను ఆహారంగా తీసుకుంటుంటే.. ఆర్ధికరంగం అట్టడుగున పడుతుంటే.. ఉన్నవాడే గాని లేని వాడి కన్నీటి వేదన ఎవరికి కావాలి.. అవును ఇది నిజమనిపించే అత్యంత ఘోర ఘటన చదివిన వారి కళ్లు చెమ్మగిల్లక తప్పవు.. అదేమంటే ఒక నిరుపేద తల్లి తన పిల్లల ఆకలి తీర్చేందుకు, రాళ్లను ఉడకబెట్టి, వంటవండుతున్నట్టు నటించి, వారిని మరపిస్తుంది. ఒక ప్రసిద్ధ ఆంగ్ల కథ ది స్టోన్ సూప్ లో రచయిత ఈ అంశాన్ని ప్రస్తావించాడు..

 

 

ఇది చదివిన వారు రచయిత చాదాస్తం గాని ఈ కధ వాస్తవానికి చాలా దూరంగా ఉంది అని నవ్వుకోక తప్పదు.. అయితే ఈ కథ నిజమని నిరూపితమైంది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో కెన్యా ఒకటి. కరోనా కారణంగా అక్కడ లాక్డౌన్ అమలులో ఉంది. ఇది పేదలకు శాపంగా మారి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.. ఎందరో పేదలు ఆకలికి అలమటిస్తున్నారు.. ఈ నేపధ్యంలో ఒక కుటుంబంలోని పెనినా బహానీ అనే ఒక వితంతువు.. వారింట్లో తినడానికి ఏమీ లేనప్పుడు.. పిల్లల ఆకలి మరపించడానికి  రాళ్ళు ఉడికించి, వంట చేస్తున్నట్లు నటించింది. పిల్లలు తమకు ఆహారం సిద్ధమవుతున్నదని కాచుకుని ఎదురు చూసి చూసి చివరకు నిద్రపోయారు.

 

 

ఇకపోతే కరోనా వల్ల ఎనిమిది మంది పిల్లల తల్లి అయిన ఆమె ఉపాధి కోల్పోయి, తినడానికి తిండి కూడా లేని దీనావస్దలో ఉంది.. చూశారా లోకంలో ఆకలికి తాళలేక కన్నీటితో కడుపు నింపుకుంటున్న నిరుపేదల పరిస్దితి.. అందుకే కష్టం విలువ, అన్నం విలువ అది అనుభవించిన వారికే తెలుస్తుంది.. వారికి పేదల బాధల కోసం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఆకలికి ఉన్నవాడు లేనివాడని తేడా ఏమి ఉండదు.. అందరికి అది ఒక్కటే.. ఇక నేటి సమాజంలో మనుషులు పూర్తిగా స్వార్ధంతో నిండిపోయారు.. అందుకే కాలం ఇలా సమాధానం చెబుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: