బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో ఎందుకంటే ఆ మసాలాలు ఘాటుగా ఉంటుంది..రుచి ఉంటుంది.. అలాగే చూడగానే నోరూరించే గుమగుమలతో ఉండి ఆకర్షిస్తుంది.. అందుకే రాజ్యాలు మారిన రాష్ట్రాలు మారిన బిరియాని టెస్ట్ మారదు..అందుకే బిరియాని టాక్ మామూలుగా లేదని చెప్పాలి.. అయితే ఈ బిరియాని లో మాసం కు ప్రత్యేక టెస్ట్ ఉండటం వల్ల డిమాండ్ కూడా ఎక్కువే.. అయితే.. చికెన్ మటన్ తో కాకుండా కాకి మాంసంతో కూడా బిరియాని చేస్తారట.. దేవుడా.

 

 

 

 

 

ఈ వార్త బిరియాని ప్రియులకు షాక్ అనే చెప్పాలి..వివరాల్లోకి వెళితే..రామేశ్వరంలోని ఓ ఆలయంలో బియ్యం గింజలు తినగానే కాకులు స్పృహ తప్పడం చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఆ బియ్యం గింజలను పరిశీలించారు...

 

 

 

 

స్పృహ తప్పుతున్న కాకులను తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఆ బియ్యాన్ని లిక్కరులో ముంచుతున్నారని, అవి తినగానే కాకులు స్పృహ తప్పుతున్నాయని తెలుసుకున్నారు. ఆ కాకులను చంపి, చికెన్‌ పేరుతో అమ్మేస్తున్నామని నిందితుడు తెలిపాడు..కాకి మాంసం వల్ల ఆ రాష్ట్రంలో నీ ప్రజలు బయట బిర్యానీలు తినాలంటేనే భయపడిపోతున్నారు...అందుకే ఎక్కడ చూసినా కూడా మోసాలు జరుగుతున్నాయి..

 

 

 

ఆ ప్రాంతంలో  పిల్లుల మాంసంతో కూడా బిరియాని చేస్తున్నారని గతంలో ఓ రైడ్ లో దొరికిపోయింది.. అందుకే ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళిన సాంబార్ ట్రై చేయండి.. బిరియాని జోలికి వెళ్లకండి.. అంటూన్నరు నిపుణులు..బిరియాని ప్రియులకు ఇది షాక్ అనే చెప్పాలి.. ఇదండీ అసలు మ్యాటర్.. ఏ మాంసం అక్కడ ఉంటుందో కూడా తెలియదు అని మదన పడుతున్నారు..అందుకే రంజాన్ అని బయట తినకండి.. పది రూపాయలు పోయిన ఇంట్లోనే చేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: