కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేరళ  సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారాలు మాత్రం అన్ని జోన్ల లో పూర్తిగా షట్ డౌన్ కొనసాగుతుందని సీఎం విజయన్ శనివారం వెల్లడించారు. ఇప్పటికే కేరళ లో కరోనా తగ్గుముఖం పట్టినా భవిష్యత్తులో మళ్ళీ కరోనా సమస్య ఉండకూడదని అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని  సీఎం వెల్లడించారు అలాగే మే 4నుండి మూడో దశ లాక్ డౌన్ కొనసాగనుండగా మద్యం దుకాణాలు ఓపెన్ చేసే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని  విజయన్ అన్నారు. ఇక నిన్న ఒక్క కేసు కూడా లేకున్నా వున్న కేరళ లో ఈరోజు కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి దాంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య  499కి చేరింది. ఇందులో ప్రస్తుతం 96కేసులు యాక్టీవ్ గా ఉండగా 400 మంది కోలుకున్నారు కాగా 3 మరణించారు. 
 
ఇక సౌత్ లో మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో రోజు రోజు పరిస్థితి దిగజారిపోతుంది. ఈఒక్క రోజే అక్కడ 217 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలో కూడా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు ఈరోజు కొత్తగా మరో 62 కేసులు నమోదు కాగా తెలంగాణ లో శనివారం మరో 17కొత్త కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: