ఆంధ్రాలో కరోనా దడ పుట్టిస్తోంది. రోజూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందులోనూ ప్రత్యేకించి కొన్ని చోట్ల ఈ కరోనా మరీ ఆందోళన కరంగా తయారైంది. అలాంటి ప్రాంతాల్లో కర్నూలు జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కర్నూలు జిల్లాలో కరోనా పాజటివ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 400 దాటిపోయింది. శనివారం మరో 25 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

 

 

ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం కర్నూలు జిల్లాలో 436 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రంలోనే ఇది ఆందోళన కలిగించే అంశంగా తయారైంది. ఏపీలో కరోనా వచ్చిన కొత్తలో అసలు కర్నూలులో కేసులు నమోదు కాలేదు. కాస్త ఆలస్యంగా మొదలైన కేసులు రోజురోజుకూ దుసుకుపోతున్నాయి. రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేసుకు తీసుకెళ్లాయి. ఇంకా ఈ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

 

 

కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకూ కరోనాతో 10 మంది ప్రాణాలు వదిలారు. జనంలో తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. గత నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 కేసులు పైగా నమోదయ్యాయి. ఆ లెక్కలు పరిశీలిస్తే.. శుక్రవారం 25, గురువారం 43, బుధవారం 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే... కేవలం నాలుగు రోజలు వ్యవధిలో వందకుపైగా పాజిటివ్ కేసులు వచ్చాయన్నమాట.

 

 

శనివారం నమోదైన 25 కేసుల్లో.. 18 కర్నూలు, 3 నంద్యాల, 1 ఆత్మకూరు, 1 ఆదోనిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలో మొత్తం 265, నంద్యాల పట్టణంలో 90 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 11 వేల 325 శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పివరకూ 66 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన 360 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: