ఏపీలో మందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. అయితే చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగా ఇది మందు విక్రయాల కోసం కాదండోయ్.. మందు తయారీకి.. అవును మరి.. ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలకు జగన్ సర్కారు శ్రీకారం చుడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఇరవై డిస్టిలరీలు తిరిగి ప్రారంభించడానికి జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 

 

అయితే ఈ డిస్టిరీల్లో మద్యం తయారీ ప్రక్రియ కేంద్ర ఆదేశాలకు అనుగుణంగానే జరగాల్సి ఉంటుంది. మద్యం తయారీ సంస్థలు వారి కంపెనీలను పూర్తిగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. అంతే కాదు.. కేంద్రం చెప్పే ఇతర జాగ్రత్తలు పాటించాలని ఏపీ సర్కారు స్పష్ఠం చేసింది. మద్యం తయరీ సమయాల్లో కార్మికులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని జగన్ సర్కారు సూచించింది.

 

 

కార్మికులకు కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా ఉండాలని ప్రభుత్వం నియమాలు పెట్టింది. అంతే కాదు.. ఈ కంపెనీలలో గుట్కా, సిగరెట్ లు నిషేధం. కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఈ ఫ్యాక్టరీల్లో లిఫ్టులు ఉపయోగించకూడదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

 

ఇక ముందు ముందు మనం కరోనాతో సహజీవనం చేయక తప్పదని ముఖ్యమంత్రి ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఇక క్రమంగా ఒక్కో వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థలను ఎక్కువ కాలం తొక్కిపెడితే అవి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉన్నమాట కూడా నిజమే. అలాగని కరోనా విషయం నిర్లక్ష్యం వహించకుండానే.. వ్యవస్థలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: